Begin typing your search above and press return to search.

ట్రిపుల్ త‌లాక్ ను అలా పోల్చేసిన సీఎం

By:  Tupaki Desk   |   17 April 2017 10:04 AM GMT
ట్రిపుల్ త‌లాక్ ను అలా పోల్చేసిన సీఎం
X
ఒక నేత ఇమేజ్ కొన్ని సంద‌ర్భాల్లో మారిపోతుంటుంది. ఎవ‌రిదాకానో ఎందుకు.. యూపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన యోగి ఆదిత్య‌నాథ్ ముచ్చ‌టే తీసుకోండి. సీఎం కాక ముందు ఆయ‌న నోటి నుంచి ఏ మాట వ‌చ్చినా అదో వివాదంగా మార‌ట‌మే కాదు.. దాని మీద ఎంత ర‌చ్చ జ‌ర‌గాలో అంత ర‌చ్చ జ‌రిగేది. కానీ.. యూపీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఆయ‌న మాట‌లు మొత్తంగా మారిపోయాయో.. లేక‌.. ఆయ‌న మాట‌ల్నిమీడియా స‌రికొత్త‌గా అర్థం చేసుకుంటుందో కానీ.. వివాదాల ప‌రంప‌ర త‌గ్గుముఖం ప‌ట్ట‌ట‌మే కాదు.. ఆయ‌న ఇమేజ్ మొత్తంగా మారిపోయిన ప‌రిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయి. ట్రిపుల్ త‌లాక్ విష‌యంలో మోడీ బ్యాచ్‌కున్న నిశ్చిత అభిప్రాయానికి నిలువెత్తు రూపంగా యోగి నిలుస్తారు. ట్రిపుల్ త‌లాక్‌ ను ఎట్టి ప‌రిస్థితుల్లోనూ తొల‌గించాల‌ని యోగి ఫీల్ అవుతుంటే.. ముస్లిం మ‌త పెద్ద‌లు మాత్రం అందుకు భిన్నంగా రియాక్ట్ అవుతున్న ప‌రిస్థితి. ఈ ఇష్యూలో త‌మ స్టాండ్‌ ను ముస్లిం మ‌హిళ‌లు ముక్త కంఠంతో మ‌ద్ద‌తు ప‌లుకుతున్న‌ట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ట్రిఫుల్ త‌లాక్ ఇష్యూపై యోగి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ట్రిపుల్ త‌లాక్‌ ను ర‌ద్దు చేయాల్సిన అవ‌స‌రాన్ని ఆయ‌న నొక్కి వ‌క్కాణిస్తూ.. మూడుసార్లు త‌లాక్ చెప్ప‌టాన్ని ద్రౌప‌తి వ‌స్త్రాప‌హ‌ర‌ణంతో పోల్చారు. మాజీ ప్ర‌ధాని చంద్ర‌శేఖ‌ర్‌ పై రాసిన పుస్త‌కాన్ని తాజాగా ఆవిష్క‌రించిన సంద‌ర్భంగా ఆయ‌నీ వ్యాఖ్య‌లు చేశారు.

ట్రిపుల్ త‌లాక్ పై కొంద‌రు మౌనంగా ఉంటున్నార‌ని.. అలాంటి వారిని దోషులుగా ప‌రిగ‌ణించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న యోగి.. మూడుసార్లు ట్రిపుల్ త‌లాక్ చెప్ప‌టం అంటే.. ద్రౌప‌తి వ‌స్త్రాప‌హ‌ర‌ణంతో స‌మానంగా ఆయ‌న చెప్పారు. ట్రిఫుల్ త‌లాక్ విష‌యంలో ముస్లిం మ‌హిళ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌న్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్ర‌భుత్వం ప‌వ‌ర్‌లోకి వ‌స్తే ట్రిపుల్ త‌లాక్ ర‌ద్దు చేస్తుంద‌న్న ఉద్దేశంతోనే తాము.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఓటు వేసిన‌ట్లు ప‌లువురు ముస్లిం మ‌హిళ‌లు చెప్ప‌ట‌మే కాదు.. ట్రిపుల్ త‌లాక్‌ ను ర‌ద్దు చేయాలంటూ ప‌లువురు ముస్లిం మ‌హిళ‌లు యోగిని క‌లిసి త‌మ‌కు న్యాయం చేయాల‌ని కోర‌టం గ‌మ‌నార్హం. ఇలాంటి వేళ‌.. యోగి చేసిన ద్రౌప‌తి వ‌స్త్రాప‌హ‌ర‌ణం వ్యాఖ్య‌లు ఎలా మార‌తాయ‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారాయ‌ని చెప్పక‌త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/