Begin typing your search above and press return to search.

హత్రాస్ రేప్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సీఎం యోగి సంచలనం

By:  Tupaki Desk   |   3 Oct 2020 6:10 PM GMT
హత్రాస్ రేప్ కేసును సీబీఐకి అప్పగిస్తూ సీఎం యోగి సంచలనం
X
హత్రాస్ బాలికపై నలుగురు యువకుల దారుణ అత్యాచారంతో దేశమంతా రగిలిపోయింది. దీనిపై దళితులు, ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నిరసన తెలిపాయి. కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకలు బాధిత కుటుంబాన్ని ఈరోజు పరామర్శించారు. ఎన్నో అడ్డంకులు దాటి.. పోలీసుల ఆంక్షలను దాటుకొని హత్రాస్ బాధితురాలి కుటుంబం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితుల తరుఫున తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

రాహుల్, ప్రియాంక గాంధీలు బాధిత కుటుంబాన్ని పరామర్శించి యోగి సర్కార్ నిందితులను కాపాడుతోందని తీవ్ర విమర్శలు చేశారు.ఈ క్రమంలోనే ఇరుకునపడిపోయిన యూపీలోని యోగి సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది.

హత్రాస్ బాలికపై హత్యాచారం కేసును యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తాజాగా సీబీఐకి అప్పగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విపక్షాలు టార్గెట్ చేయడంతో యూపీ సీఎం యోగి ఈ నిర్ణయం తీసుకున్నాయి. హత్రాస్ బాలిక కేసుపై దర్యాప్తు చేయాలని కేంద్ర బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ను ఆదేశించారు. సిబిఐ దర్యాప్తుకు సిఎం సిఫారసు చేసినట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని హత్రాస్ జిల్లాలో 20 ఏళ్ల యువతిపై అత్యాచారం, హత్య కేసులో ఇప్పటివరకు నలుగురు అగ్రవర్ణ యువకులను అరెస్ట్ చేశారు. దీంతో వారిని కాపాడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. బాధితురాలి శవాన్ని పోలీసులు అర్ధరాత్రి 2.30కు కాల్చడం వివాదాస్పదమైంది. దీంతో ఈ కేసును కేంద్ర బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) విచారణకు ఆదేశిస్తూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శనివారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. దీంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టారు.