Begin typing your search above and press return to search.
సీఎం యోగీ ప్రశ్నః కనేది మీరు..బాధ్యత మాదా?
By: Tupaki Desk | 31 Aug 2017 8:28 AM GMTకొద్దికాలం క్రితం వరకు తనదైన అద్భుతమైన పాలనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇప్పుడు వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మరోమారు పసిపిల్లల మరణంపై స్పందించారు. గోరఖ్ పూర్ లో పసికందుల మరణాల గురించి యోగి ఆదిత్యనాథ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పిల్లల తల్లిదండ్రులను ఎగతాళీ చేసేలా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. 'పిల్లలకు రెండేళ్లు దాటగానే తల్లిదండ్రులు వారి బాధ్యతను ప్రభుత్వంపై వేసేస్తున్నారు' అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. 'రోడ్డుపై చెత్త కనపడితే.. సర్కారుదే బాధ్యత అంటారు. అన్ని బాధ్యతలు సర్కారుపై వేసి జనమంతా విముక్తులయ్యారా?' అంటూ ప్రశ్నించారు.
స్టార్టప్ బస్సుయాత్ర కార్యక్రమం సందర్భంగా యూపీ సీఎం యోగి ప్రసంగిస్తూ...``మనలో సివిక్ సెన్స్ లేదు. మనం పరిశుభ్రతను కోరుకోం. దీనికి ప్రభుత్వమే జవాబుదారీనా? నగరపాలక సంస్థలు - పంచాయతీలు ఉన్నాయి. ఇది వాటి బాధ్యత. జనమంతా సర్కారుదే బాధ్యత అనుకుంటున్నారు. ఒకటి - రెండేండ్లు తమ బిడ్డల ఆలనాపాలనా చూసి.. ఆ తర్వాత బిడ్డల బరువు - బాధ్యతలన్నీ సర్కారీదే అన్న విధంగా తల్లిదండ్రుల ఆలోచన మారిందని నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది`` అంటూ వ్యాఖ్యలు చేశారు. ఆవును ఎంతగానో ప్రేమించే యోగికి ఇప్పుడు వాటిపై కూడా కోపం వచ్చేసింది. ``ఇళ్లల్లో ఆవులు పెంచితే... అవి ఇచ్చే పాలు అమ్ముకోవచ్చు. కాని వాటిని ఇప్పుడు రోడ్లపై వదిలేస్తున్నారు. వాటి బాధ్యత కూడా ప్రభుత్వానిదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. తమ నియోజకవర్గాల్లో గోశాలలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యేలు అంటున్నారు. బాగానే ఉన్నది. పాలు మీరు తాగుతారు. గడ్డి - పేడ బాధ్యత సర్కారుదా?` అని యోగి ప్రశ్నించారు.