Begin typing your search above and press return to search.
పెను సాహసానికి తెర తీసిన సీఎం యోగి
By: Tupaki Desk | 31 May 2017 8:06 AM GMTరాజకీయాల వెన్నంటి ఉంటే వివాదాలకు వీలైనంత దూరంగా ఉండేందుకు అందరూ ప్రయత్నిస్తుంటారు. వివాదానికి అవకాశం ఉంటుందన్న భావన రేఖా మాత్రంగా ఉన్నా.. ఆ ఇష్యూ దరిదాపుల్లోకి వెళ్లేందుకు సైతం ఇష్టపడరు రాజకీయనేతలు. కానీ.. ఇలాంటి వాటికి అతీతంగా కనిపిస్తున్నారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్. తాజాగా ఆయన తీసుకున్న నిర్ణయం పెను సంచలనంగా మారింది.
ఈ రోజు ఆయన అయోద్యలోని రామజన్మభూమిని సందర్శించటానికి డిసైడ్ చేశారు. నిన్నటిని నిన్న వివాదాస్పద కట్టడం కూల్చివేత కేసులో నిందితులుగా ఉన్న బీజేపీ అగ్రనేతలు ఎల్ కే అద్వానీ.. మురళీ మనోహర్ జోషి.. ఉమాభారతి తదితరులు ప్రత్యేక కోర్టుకు హాజరైన తర్వాతి రోజే.. సీఎం యోగి రామజన్మభూమి ప్రాంతంలో పర్యటించాలన్న నిర్ణయం తీసుకోవటం విశేషం.
తాజా పర్యటనతో రామ జన్మభూమి ఉదంతం మరింత వేగంగా తెర మీదకు తీసుకురావటంతో పాటు.. రామ మందిర నిర్మాణానికి మద్దతుగా తాను ఉండనున్న విషయాన్ని యోగి తేల్చినట్లుగా చెబుతున్నారు. వివాదాస్పద రామజన్మ భూమి ప్రాంతాన్ని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి సందర్శించటానికి ఏ మాత్రం సముఖత చూపకపోవటం ఇప్పటివరకూ జరిగింది.
గడిచిన పదిహేనేళ్ల సమయంలో రామజన్మ భూమిలోని వివాదాస్పద ప్రదేశానికి వెళ్లటానికి ఏ ముఖ్యమంత్రి సాహసించలేదు. దీనికి భిన్నంగా యోగి మాత్రం.. వెళ్లాలని డిసైడ్ కావటం విశేషంగా చెప్పాలి. కరసేవకుల కారణంగా దశాబ్దాల క్రితం వివాదాస్పద కట్టటం కూలిపోయిన విషయం తెలిసిందే. ఇలా జరగటానికి బీజేపీ అగ్రనేతలు కొందరు కారణం అంటూ వారిపై ఫిర్యాదులు ఉన్నాయి. దీనిపై కోర్టు కేసు నడుస్తోంది. ఇదిలా ఉండగా.. వివాదాస్పద ప్రాంతంలో తాత్కాలికంగా కట్టిన గుడిని సందర్శించాలన్న నిర్ణయాన్ని తీసుకున్నారు యోగి.
వివాదాస్పద కట్టడాన్ని కూల్చి వేసేందుకు కుట్ర చేశారంటూ అభియోగాలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలకు బెయిల్ మంజూరు చేశారు. బెయిల్ మంజూరు అయిన పక్క రోజునే యూపీ ముఖ్యమంత్రి యోగి.. వివాదాస్పద ప్రాంతానికి వెళ్లాలనుకోవటం చేస్తుంటే.. రామజన్మభూమిలో రామాలయం అంశాన్ని తెర మీదకు తీసుకురావటమే కాదు.. రామాలయ నిర్మాణంలో తమకున్న కమిట్ మెంట్‌ను సీఎం హోదాలో ఉన్న యోగి చెప్పకనే చెప్పేసినట్లుగా చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/