Begin typing your search above and press return to search.
యూపీలో ఆ హడావుడేంది? ఢిల్లీకి యోగి ఎందుకొచ్చినట్లు?
By: Tupaki Desk | 11 Jun 2021 4:30 AM GMTతెలివైన వారెవరూ జరిగిన దాని గురించి అదే పనిగా ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయరు. జరగాల్సిన దాని గురించి ఆలోచిస్తుంటారు. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన బెంగాల్ పీఠం దక్కకపోవటమే కాదు.. దారుణ ఓటమి ఆ పార్టీని బాధించింది. ఎంతకైనా వెళదాం.. బెంగాల్ లో మమతను ఓడిద్దామని మోడీషాలు ఎంత అనుకున్నా అది జరగకపోవటమే కాదు..దేశంలో సెకండ్ వేవ్ కు దోషులుగా మోడీషాలు ప్రజల్లో నిలబడాల్సిన దుస్థితి. గతానికి భిన్నంగా మోడీ ఇమేజ్ దారుణంగా దెబ్బ తినటం.. మరోవైపు కొద్ది నెలల్లో కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు రావటం బీజేపీ వ్యూహకర్తలకు ఒక పట్టాన మింగుడుపడటం లేదు.
మరోవైపు.. పార్టీ అంతర్గత రిపోర్టులతో పాటు..పార్టీకి దిశానిర్దేశం చేసే సంఘ్ పరివార్ సైతం యూపీలో యోగి సర్కారు పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న రిపోర్టుతో మోడీ మాష్టారు అలెర్టు అయినట్లు చెబుతున్నారు. యూపీలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవటం.. ఎన్నికల వేళ యోగి సర్కారు మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే కసరత్తు పెద్ద ఎత్తున మొదలైంది.
ఇందులో భాగంగానే కాంగ్రెస్ కు చెందిన జితిన్ ప్రసాద్ ను పార్టీలోకి చేర్చుకున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీకి రావాలంటూ యూపీ ముఖ్యమంత్రి యోగికి కబురు పంపటం రాజకీయ చర్చకు దారి తీసింది. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్న యోగి.. తొలుత అమిత్ షాతో.. ఆ తర్వాత నరేంద్ర మోడీతో భేటీ అయ్యేలా షెడ్యూల్ సిద్ధం చేశారు. ఇప్పటికే అమిత్ షా తో సమావేశం పూర్తి కావటం.. మోడీతో భేటీ కోసం ఆయన ఎదురుచూస్తున్నారు.
ఇదంతా చూస్తుంటే.. యూపీ రాజకీయ పరిణామాలపై మోడీషాలు ఏదో ప్లానింగ్ చేస్తున్నారని చెప్పక తప్పదు. దీనికి కారణం లేకపోలేదు. గురువారం తన ఢిల్లీ పర్యటనకు కొన్ని గంటల ముందు.. మరింత వివరంగా చెప్పాలంటే బుధవారం అర్థరాత్రి వేళలో లక్నోలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష.. ప్రధాన కార్యదర్శులతో భేటీ నిర్వహించారు. ఇది ప్రతి నెలా రోటీన్ గా జరిగే మీటింగ్ అని చెబుతున్నా.. అదేమీ కాదంటున్నారు. ఎందుకంటే.. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ ను హెలికాఫ్టర్ లో హుటాహుటిన లక్నోకు చేరుకోవటమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు.
తాజాగా పార్టీలో చేరిన జితిన్ ప్రసాద్ కు పెద్దపీట వేయటంతో పాటు..ఆయనతో కలిసి పని చేసేందుకు వీలుగా సీఎం యోగికి మోడీషాలు మార్గదర్శనం చేయనున్నట్లు చెబుతున్నారు. వీరితో పాటు.. పార్టీ నేతలు.. క్యాడర్ కూడా అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించాలని.. కలిసి పని చేయాలన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పి పంపుతారని చెబుతున్నారు. కొవిడ్ ను తగ్గించటంలో యోగి సర్కారు భారీగా ఫెయిల్ అయ్యిందన్న వాదన జోరుగా వినిపిస్తున్న వేళ.. మోడీషాలు దిద్దుబాటు చర్యలకు పూనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.