Begin typing your search above and press return to search.
ములాయం గోశాలకు సీఎం..ఇంట్లో ముసలం
By: Tupaki Desk | 31 March 2017 10:58 AM GMTఉత్తరప్రదేశ్ లో రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి. తన అనూహ్య నిర్ణయాలతో దేశం చూపును యూపీ వైపు తిప్పుకొంటున్న ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అదే రీతిలో రాజకీయ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. సమాజ్‌వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇంటిలో ఉన్న గోశాలను సీఎం యోగి ఆదిత్యనాథ్ సందర్శించారు. ములాయం కుమారుడు ప్రతీక్ యాదవ్ - ఆయన భార్య అపర్ణ ‘కన్హా ఉప్వాన్’ పేరిట గో సంరక్షణ శాలను నిర్వహిస్తున్నారు. ఇవాళ ఈ గోశాలను సీఎం సందర్శించి గోవులకు దాణ వేశారు. అనంతరం గోశాల నిర్వహణ గురించి అడిగి తెలుసుకున్నారు. ములాయం ఇంటికి వెళ్లి మరీ సీఎం ఈ విదంగా వ్యవహరించడం యూపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజే ప్రతీక్ - అపర్ణ ఆయనను కలుసుకుని తమ గోశాలను సందర్శించాలని ఆహ్వానించారు. గో ప్రేమికుడైన యోగి ఆదిత్యనాథ్ ఇందుకు అంగీకరించి ఇవాళ గోశాలకు వచ్చారు. యోగితోపాటు డిప్యూటీ సీఎం దినేష్ శర్మ కూడా గోశాలకు వచ్చిన వారిలో ఉన్నారు. అయితే ఈ పరిణామాన్ని సమాజ్‌వాదీ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు తీవ్ర విమర్శలకు వేదిక అయిన బీజేపీ, ఎస్పీల మధ్య ఇలాంటి పరిణామాలు తాము ఊహించలేదని చెప్తున్నారు. పైగా నేతాజి(ములాయం సింగ్ యాదవ్) కుమారుడు ప్రతీక్ - అపర్ణ చర్యలు తమకు అస్సలు అర్థం కావడం లేదని అంటున్నారు. వారు బీజేపీలో చేరుతారా లేక ఎస్పీ అధినేతతోనే ఉంటారా అనేది అర్థం కావడం లేదని వారంటున్నారు. ఈ పరిణామాలు యూపీ మాజీ సీఎం అఖిలేష్ కు- ములాయం- ప్రతీక్‌ల మధ్య ముసలం ప్రారంభం కావడానికి బీజం అయినా ఆశ్చర్యపోవక్కర్లేదని చెప్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/