Begin typing your search above and press return to search.

యోగి షాక్.. ఆందోళనలో పాల్గొంటే ఆస్తుల జప్తు

By:  Tupaki Desk   |   20 Dec 2019 6:08 AM GMT
యోగి షాక్.. ఆందోళనలో పాల్గొంటే ఆస్తుల జప్తు
X
ఉత్తరప్రదేశ్ లో ‘పౌరసత్వ’ మంటలు అంటుకుంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఇప్పటికే యూపీలో ఇద్దరు ఆందోళనకారులు పోలీసుల కాల్పుల్లో చనిపోవడం ఉద్రికత్తకు దారితీసింది. రోజుకో తరహా నిరసనలతో యూపీ అంతటా హింస చెలరేగుతోంది.

తాజాగా నిరసనకారులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అల్లర్లకు హింసకు దిగే ఆందోళనకారుల ఆస్తుల జప్తు చేసి నష్టపోయిన వారికి ఆ ఆస్తిని పంచుతామని హెచ్చరించారు.

ఇక లక్నో, సంభాల్ లో హింసను కాంగ్రెస్ - ఎస్పీ ప్రోత్సహిస్తున్నాయని.. ప్రజల ఆస్తులు - ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇక ఆందోళనలు తగ్గకపోవడం యూపీ సీఎం యోగి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఈ శనివారం వరకు ఇంటర్నెట్ - మొబైల్ సేవలు నిలిపివేశారు. కనీసం ఎస్ఎంఎస్ కూడా చేసుకోరాకుండా చేశారు. ఆందోళన తగ్గకపోతే మరింతగా పొడిగిస్తామని స్పష్టం చేశారు.