Begin typing your search above and press return to search.
అర్థరాత్రి వేళ ఆ సీఎం సడెన్ విజిట్ షాక్!
By: Tupaki Desk | 4 Jan 2018 7:24 AM GMTముఖ్యమంత్రి అన్నోడు అస్సలు అర్థంకానట్లుగా ఉండాలన్నట్లుగా ఉంటుంది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి తీరు చూస్తే. ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్థం కానట్లుగా ఆయన వ్యవహారం ఉంటుంది. అధికారుల్ని ఉరికించటంలో ఆయన దిట్ట.
ఆకస్మిక తనిఖీల పేరుతో యూపీ అధికారులకు నిద్ర లేకుండా చేసే యోగి.. తాజాగా అర్థరాత్రి వేళ రాజధాని నగరంలో ఆయన చేపట్టిన ఆకస్మిక తనిఖీలు అధికారుల్ని పరుగులు పెట్టేలా చేశాయి. యోగి సడన్ విజిట్ తో అధికారులు కిందామీదా పడిపోయారు. బుధవారం అర్థరాత్రి వేళ యూపీ రాజధాని లక్నోలోని బలరామ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిరుపేదల కోసం కొత్తగా నిర్మించిన షెల్టర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అంతేకాదు.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్లలో తలదాచుకుంటున్న నిరుపేదలతో మాట్లాడారు. ప్రభుత్వ షెల్టర్లలో మౌలిక సదుపాయాల గురించి ఆరా తీసిన ఆయన.. అక్కడ చలి ఎక్కువగా ఉండటంతో హీటర్లు పెట్టాలన్న సూచన చేశారు. ఈ ఏడాది ఎక్కవ చలి ఉండటంతో పేదల కోసం నైట్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. చలి నుంచి కాపాడుకునేందుకు ప్రత్యేక దుస్తులు.. దుప్పట్లను పంపిణీ చేశారు.
చలి పులి నుంచి కాపాడుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయా? లేవా? అన్న విషయాన్ని తెలుసుకోవటంతో పాటు.. మరిన్ని వసతులు అవసరమా? అన్న అంశాన్ని గుర్తించేందుకు ఆకస్మిక తనిఖీలని చెబుతున్నారు. ప్రభుత్వం పథకాల్ని అమలు చేయటమే కాదు.. ఆ అమలు ఎలా ఉందన్న విషయాన్ని లోకానికి చాటి చెప్పేందుకు వీలుగా యోగా సర్కారు ఆకస్మిక తనిఖీలు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి పుణ్యమా అని అర్థరాత్రి వేళ పరుగులు పెట్టిన అధికారుల తిప్పల్ని పక్కన పెడితే.. తాజా ఆకస్మిక తనిఖీతో మాత్రం ముఖ్యమంత్రుల వారి ఇమేజ్ మాత్రం పెరిగింది. లెక్కల విషయంలో యోగి కచ్ఛితంగా ఉన్నట్లు కనిపించట్లేదు?