Begin typing your search above and press return to search.

ప్రియాంకకు పాపులారిటీ తెస్తున్న యోగి

By:  Tupaki Desk   |   20 July 2019 10:42 AM GMT
ప్రియాంకకు పాపులారిటీ తెస్తున్న యోగి
X
ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు. కొన్ని పట్టించుకోవడం వల్లే ఎక్కువ నష్టాలు జరుగుతాయి. యోగి ప్రభుత్వం పరిస్థితి ఇలాగే ఉంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన మారణ కాండ బాధితులను పరామర్శించడానికి వెళ్తున్న కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని అడ్డుకోవడానికి యూపీ ప్రభుత్వం శతధా ప్రయత్నం చేస్తోంది. యోగి ప్రయత్నాలను కాంగ్రెస్ పాజిటివ్ గా మార్చుకుంటోంది.

ఇదీ నేపథ్యం...
ఇటీవల సోన్‌ భద్ర జిల్లా గోరేవాల్‌ ప్రాంతంలో ఓ భూ వివాదం విషయమై జరిగిన గొడవ కాల్పులకు దారితీసింది. ఈ కాల్పుల్లో పది మంది గోండీ తెగ ప్రజలు మరణించారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. పేదల మరణానికి ప్రభుత్వమే కారణం అంటూ విపక్షాలు భగ్గుమంటున్నాయి. దీంతో ఇది పెద్ద రచ్చగా మారింది.

ఇదీ జరుగుతున్నది...
రాష్ట్రంలో జరిగిన దుర్ఘటనను అవకాశం మలచుకుని కాంగ్రెస్ తనదైన రాజకీయం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్ నాయకురాలు ప్రియాంక గాంధీ శుక్రవారం బాధితులను పరామర్శించేందుకు సోన్‌ భద్రకు బయలుదేరారు. ఆమె అక్కడకు వెళ్తే మరో ఈ ఘటన మీడియాలో ప్రముఖంగా ప్రసారం అవుతుంది అనుకున్నారో ఏమో యోగి సర్కారు ఆమె ప్రయత్నాన్ని అడ్డకునే ప్రయత్నం చేసింది. పోలీసులు ప్రియాంక గాంధీను అడ్డుకొని మీర్జాపూర్ లోని చునార్‌ గెస్ట్‌ హౌస్‌ కు తరలించారు. తిరిగి వెళ్లిపోవడానికి ఆమె అంగీకరించడం లేదు. రాత్రి గెస్ట్‌ హౌస్‌ లోనే బస చేసిన ఆమె బాధితులను కలిసే వెళ్తానని భీష్మించుకుకూర్చున్నారు. అయితే, ఆమెను ఎలాగైనా అక్కడ నుంచి పంపేయాలని డిసైడై యోగి సర్కారు ఆ గృహానికి నీరు, కరెంట్ కట్ చేసింది. అయినా ప్రియాంక చీకట్లోనే గడుపుతున్నారు ఇది మరోసారి చర్చకు దారితీసింది.

’’ప్రియాంకను అడ్డుకోవడానికి బీజేపీ ప్రభుత్వం ఆటవిక విధానాలను ఫాలో అవుతోందని, అక్రమ అరెస్టులకు పాల్పడుతోందని‘‘ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ’’బీజేపీ సర్కార్‌ది ఆటవిక పాలన’ అంటూ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌ దీప్‌ సుర్జేవాల్‌ ట్వీట్‌ చేశారు. యోగి చర్యలతో వివాదం మరింత ముదురుతోందని పలువురు అభిప్రాయడుతున్నారు.