Begin typing your search above and press return to search.
ముఖ్యమంత్రికి గుడి.. పూజలు.. ప్రసాదాలు కూడా! ఎక్కడంటే!!
By: Tupaki Desk | 19 Sep 2022 5:01 PM GMTనిలువెత్తు విగ్రహం.. కాషాయ దుస్తులతో అలంకరణ.. చేతిలో బాణం.. తల చుట్టూ కాంతి వలయం.. రోజుకు రెండు సార్లు పూజలు, ప్రసాదాలు.. సాధారణంగా ఏ దేవుడి గుడిలోనైనా కనిపించే దృశ్యాలే ఇవి. కానీ.. ఉత్తర్ప్రదేశ్ అయోధ్య జిల్లా భరత్కుండ్లోని ఆలయం మాత్రం ప్రత్యేకం. ఈ గుడిలో.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రతిమనే దేవుడి రూపంలో ప్రతిష్టించి, నిత్య పూజలు చేయడం విశేషం. అంతేకాదు.. భజనలు.. కూడా చేస్తున్నారు.
అయోధ్యలోని రామ జన్మభూమికి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది భరత్కుండ్. వనవాసానికి వెళ్లే ముందు.. రాముడికి ఇక్కడే భరతుడు వీడ్కోలు పలికాడని పురాణాల ప్రతీతి. అదే ప్రాంతానికి చెందిన ప్రభాకర్ మౌర్య అనే వ్యక్తికి యోగి ఆదిత్యనాథ్ అంటే అమితమైన అభిమానం. అందుకే ఆయన కోసం ఫైజాబాద్-ప్రయాగ్రాజ్ హైవే పక్కన గుడి కట్టేశాడు. పూజలు చేసేందుకు ఒక పూజారిని కూడా పెట్టారు.
రాముడి కోసం గుడి కడుతున్న యోగి కోసం మేము ఆలయం నిర్మించామని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి ప్రజాసంక్షేమ కార్యక్రమాల ద్వారా దేవుడి స్థానం సంపాదించుకున్నారన్నారు. అందుకే ఆయనకు గుడి కట్టాలన్న ఆలోచన వచ్చిందని చెప్పాడు ప్రభాకర్ మౌర్య. శ్రీరాముడికి చేసినట్టే.. రోజుకు రెండుసార్లు ఆదిత్యనాథ్ విగ్రహం ముందు కీర్తనలు పాడుతున్నాడు ప్రభాకర్. పూజల తర్వాత 'భక్తులకు' ప్రసాదం పంచి పెడుతున్నాడు.
తనకు ఉద్యోగం, భూమి లేదని చెప్పాడు ప్రభాకర్. కానీ.. నెలకు రూ.లక్ష ఆదాయం వస్తుందంట. భజన్లు, భక్తి గీతాలు పాడి యూట్యూబ్లో పోస్ట్ చేయడం ద్వారా ఈ డబ్బు సంపాదిస్తున్నట్లు వెల్లడించాడు ప్రభాకర్. ఆ సొమ్ముతోనే యోగి కోసం గుడి కట్టానని వివరించాడు.
కొసమెరుపు: దేశంలో.. ముఖ్యమంత్రులకు గుడులు కట్టడం.. కొత్తకాదు. గతంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జయలలితకు కూడా గుడి కట్టారు. ఇక, కర్ణాటకలో మాజీసీఎం యడ్యూరప్పకు కూడా ఆయన అభిమానులు గుడి నిర్మించారు. అదేవిధంగా యూపీలోని వారణాసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఆయన అభిమాని ఒకరు గుడి కట్టారు.(అయితే.. దీనిని తర్వత.. తొలగించారు). అయితే.. ఈ గుళ్లలో ఎక్కడా పూజలు.. భజనలు.. ప్రసాదాలు వంటివి ఉండవు. కేవలం దండ వేసి.. దణ్ణం పెడుతున్నారు అంతే!!
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.