Begin typing your search above and press return to search.
యోగి 'బుల్డోజర్'ను సరికొత్తగా వాడేస్తున్న ఆ రాష్ట్ర సీఎం
By: Tupaki Desk | 23 March 2022 5:17 AM GMTప్రత్యర్థుల్ని విసిరిన అస్త్రాల్ని తమకు అనుకూలంగా మార్చుకోవటం అంత తేలికైన విషయం కాదు. అందులోనూ రాజకీయంలో అలాంటి అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఇటీవల ముగిసి.. ఫలితాలు వెల్లడైన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న యోగి సర్కారు.. ఇలాంటి రేర్ ఫీట్ ను సాధించారని చెప్పాలి. ఉత్తరప్రదేశ్ లో యోగి సర్కారు తిరిగి అధికారంలోకి రావటానికి బుల్ డోజర్ నినాదం ఎంతలా సాయం చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు.
వాస్తవానికి దీన్నో విమర్శగా బీజేపీ ప్రత్యర్థి సమాజ్ వాదీ సంధించిన అస్త్రాన్ని తెలివిగా వారిపైనే తిప్పికొట్టిన యోగి సర్కారు.. అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. యూపీ ఎన్నికల్లో బుల్ డోజర్ మాట ఎంతలా పని చేసిందో తెలిసిందే. ఇదే మాటను తాజాగా తమ రాష్ట్రానికి తీసుకొచ్చేశారు మరో బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్ పాటిల్. మద్యప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న ఆయన.. తాజాగా రాష్ట్రంలోని నేరస్తులు.. మాఫియా భరతం పట్టేందుకు బుల్ డోజర్ అస్త్రాన్ని బయటకు తీశారు.
రాష్ట్రానికి బుల్ డోజర్ మామ వచ్చేశాడని.. తన పని ప్రారంభించాడని.. దుర్మార్గులను పాతి పెట్టేందుకు తమ ప్రభుత్వం విశ్రమించదని హెచ్చరికలు చేశారు. యోగి సర్కారు.. తమ పాలనలో అక్రమార్కుల ఆస్తుల్ని బుల్ డోజర్లు పెట్టించి కొట్టించేసే వారు. ఈ ప్రయోగం సక్సెస్ కావటమే కాదు.. నేరస్తుల విషయంలో యోగి సర్కారు ఎంత కఠినంగా వ్యవహరిస్తారన్న విషయం అందరికి తెలిసేలా చేశారు. బుల్ డోజర్ మాటను నెగిటివ్ గా సమాజ్ వాదీ పార్టీ ప్రచారం మొదలు పెడితే.. దాన్ని హీరోయిజంగా ప్రొజెక్టు చేసి.. సక్సెస్ అయ్యారు.
ఈ నేపథ్యంలో యోగిని బుల్ డోజర్ బాబాగా పేరును సంపాదించుకున్నారు. ఈ కాన్సెప్టును తనకు తగ్గట్లుగా మార్చుకున్న శివరాజ్ సింగ్ చౌహన్.. తాజాగా బుల్ డోజర్ మామ పేరుతో కొత్త ప్రచారానికి తెర తీశారు.
ఇందులో భాగంగా భోపాల్ నగరంలో పెద్ద ఎత్తున హోర్డింగులు ఏర్పాటు చేశారు. ‘‘అక్కచెల్లెళ్లు.. కూతుళ్లు గౌరవంతో ఆటలు ఆడుకునే వారి ఇంటికి బుల్ డోజర్లు వస్తాయి. రక్షణగా నిలుస్తాయి. కుమార్తె భద్రతకు ఆటంకం ఏర్పడినా.. ఆ తల్లికి బుల్ డోజర్ సుత్తిగా సాయం చేస్తుంది. రాష్ట్రంలోని గుండాలు ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చేశారు.
భారీ ఎత్తున ఏర్పాటు చేసిన హోర్డింగుల్లో ముందు ముఖ్యమంత్రి శివరాజ్ పాటిల్.. వెనుక బుల్ డోజర్లు ఉండేలా వాటిని తయారు చేయించారు. నేరస్తులకు ప్రశాంతత లేకుండా చేస్తామని.. పేదలు.. బలహీనులపై చెయ్యెత్తితే.. తాను వారి ఇళ్లను ధ్వంసం చేస్తానని చెప్పటం సంచలనంగా మారింది. మరి.. మాటల్లోనేనా? చేతల్లోనూ బుల్ డోజర్ మామ చెప్పినట్లే చేస్తారా? అన్నదిప్పుడు ప్రశ్న. మరేం జరుగుతుందో చూడాలి.