Begin typing your search above and press return to search.

సైనా స‌రిగా ఆడ‌టం లేద‌ని క‌శ్య‌ప్ ఆరిచారా?

By:  Tupaki Desk   |   9 March 2019 6:15 AM GMT
సైనా స‌రిగా ఆడ‌టం లేద‌ని క‌శ్య‌ప్ ఆరిచారా?
X
సుదీర్ఘ‌కాలంగా బ్యాడ్మింట‌న్ ఆడుతున్న‌ప్ప‌టికీ.. ఎప్పుడూ రాని రీతిలో సైనా నెహ్వాల్ కు సంబంధించిన ఒక వార్త ఇప్పుడు వ‌చ్చింది. మ్యాచుల్లోపాల్గొన‌టం.. అందులో గెలిచినా.. ఓడినా ముఖంలో పెద్ద‌గా ఎక్స్ ప్రెష‌న్లు చేపించ‌కుండా రెండింటి విష‌యంలోనూ స‌మానం అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే వారిలో సైనా ఒక‌రిగా చెప్ప‌క త‌ప్ప‌దు. అలాంటి ఆమెకు సంబంధించి ఆట విష‌యంలోనే త‌ప్ప మిగిలిన విష‌యాలు వార్త‌లుగా రావ‌టం క‌నిపించ‌దు.

అందుకు భిన్నంగా తాజాగా సైనాకు సంబంధించిన ఒక వార్త వైర‌ల్ గా మారింది. అంద‌రి ద్రాక్ష‌గా మారిన ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింట‌న్ చాంపియ‌న్ షిఫ్ లో సైనా పోరాటం ముగిసింది.

తాజాగా ఆమె మ‌రోసారి ఓడింది. క్వార్ట‌ర్స్ ఫైన‌ల్స్ సంద‌ర్భంగా త‌న చిర‌కాల ప్ర‌త్య‌ర్థి.. చైనా క్రీడాకారిణి తైజు యింగ్ చేతిలో సైనా ఓడింది. దీంతో.. ఆమె వ‌రుస‌గా 13వ ఓట‌మిని చ‌విచూడాల్సి వ‌చ్చింది. ఈ మ్యాచ్ మ‌ధ్య‌లో సైనాను ఆమె భ‌ర్త.. క‌మ్ బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు పారుప‌ల్లి క‌శ్య‌ప్ మంద‌లించిన‌ట్లుగా చెబుతున్నారు.

మ్యాచ్ మ‌ధ్య‌లో సైనా చేస్తున్న త‌ప్పుల్ని క‌శ్య‌ప్..ఆమె కోచ్ కోర్టు ప‌క్క‌న కూర్చొని స‌ల‌హాలు చెప్పినా.. ఆమె ఆట తీరు మెరుగుప‌డ‌ని వైనం వారిని అసంతృప్తికి గురి చేసిన‌ట్లుగా చెబుత‌న్నారు. అన‌వ‌స‌ర‌మైన త‌ప్పిదాలు చేస్తూ మ్యాచ్ చేజార్చుకున్న సైనాపై క‌శ్య‌ప్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఓయే.. నువ్వు చెత్త షాట్స్ కొడుతున్నావ్‌.. మ్యాచ్ గెల‌వాల‌ని ఉంటే ప‌రిస్థితిని అర్థం చేసుకుంటూ జాగ్ర‌త్త‌గా ఆడు అంటూ మంద‌లించ‌టంతో పాటు.. ఆమె చేస్తున్న త‌ప్పుల్ని వ‌రుస పెట్టి చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

క‌శ్య‌ప్ చెప్పిన స‌ల‌హాల్ని పాటించిన సైనా ఒక సెట్ ను గెల‌వ‌గా.. మ్యాచ్ ను చేజార్చుకుంది. పోటాపోటీగా ఆడుతున్న ప్ర‌త్య‌ర్థితో సెట్లు స‌మం చేసుకున్న‌ప్ప‌టికి.. కీల‌క‌మైన సెట్ ను సొంతం చేసుకునే వేళే.. మ్యాచ్ ను త్వ‌ర‌గా ముగిద్దామ‌న్న తొంద‌ర‌లో వ‌రుస త‌ప్పులు చేయ‌టంతో మ్యాచ్ చేజారిన‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. సైనా.. క‌శ్య‌ప్ ఇరువురు సుదీర్ఘ‌కాలం ప్రేమించుకొని గ‌త డిసెంబ‌రులో పెళ్లి చేసుకోవ‌టం తెలిసిందే.