Begin typing your search above and press return to search.
నువ్వే బలహీనం బైడెన్.. భారత్ కాదు గుర్తు పెట్టుకో!
By: Tupaki Desk | 23 March 2022 3:29 AM GMTపెద్దన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్‌పై నోరు పారేసుకున్నారు. ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్ ఎందుకో వణుకుతోందని వ్యాఖ్యానించారు. అమెరికా మిత్ర దేశాల్లో భారత్ మాత్రమే మాస్కోపై ఆంక్షలకు భయపడుతోందని అన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి వ్యతిరేకంగా మద్దతు తెలిపే విషయంలో భారత్ అస్థిరంగా ఉందని, ఈ విషయంలో అమెరికా మిత్ర దేశాలన్నీ ఐక్యంగా ముందుకు వచ్చాయని బైడెన్ తెలిపారు. క్వాడ్ దేశాల్లో భారత్ మాత్రమే రష్యాపై కఠినంగా లేదని, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా మాత్రం తీవ్ర ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు ఆయన సీఈఓల బిజినెస్ రౌండ్ టేబుల్ త్రైమాసిక సమావేశంలో మాట్లాడారు.
అయితే.. దీనికి దీటుగా భారతీయులు స్పందిస్తున్నారు. అగ్రరాజ్యం కుటిల బుద్ధిని బయట పెట్టుకుందని.. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. భారత్ ఎప్పుడూ.. ఎవరికీ భయపడే పరిస్థితిలో ఉండదని.. ఏనాడూ.. ఒకరితో నీతులు చెప్పించుకునే పరిస్థితిలోనూ లేదని.. భారతీయులు ముక్తకంఠంతో వ్యాఖ్యానిస్తున్నారు. అగ్రరాజ్య అధ్యక్షుడిని దుయ్యబడుతున్నారు. 'సర్వే జనా సుఖినో భవంతు" అనే సూత్రాన్ని భారత్ నరనరానా నింపుకున్నదని చెబుతున్నారు. అందరూ బాగుండాలి.. అందులో భారత్ కూడా ఉండాలనే సూత్రాన్నే భారత్ పాటిస్తుందని అంటున్నారు.
అంతేకాదు, ప్రపంచంలో ఎలాంటి సమస్య వచ్చినా.. ఎక్కడ ఎలాంటి ఉపద్రవం వచ్చినా.. దానిని పరిష్కరించేందుకు, శాంతి యుత సాధన దిశగా.. వ్యవహరించేందుకు భారత్ ఎప్పుడూ.. ముందుకు వస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే గత రెండేళ్లపాటు.. ప్రపంచం కరోనాతో ఒణికిపోయినప్పుడు.. భారత్ తొలిసారి.. వ్యాక్సిన్‌ను రూపొందించింది. ఆత్మనిర్భరతకు మారుపేరుగా రూపొందించిన ఈ వ్యాక్సిన్‌ను ప్రపంచ దేశాలకు కూడా పంపిణీ చేసిన విషయం అది కూడా ఉచితంగా అందించి.. ప్రపంచ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిన విషయం ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
పేద దేశాలకు కూడా వ్యాక్సిన్‌నుఅందించిన ఏకైక దేశం భారతేనని గుర్తు చేస్తున్నారు. భారత్ తన విధానంలోనే ప్రేమ, శాంతిని కోరుకుంటుంది. ప్రతి దేశంతోనూ.. సఖ్యతను కోరుకుంటుంది. అంతేకాదు.. శతృదేశమైన పాకిస్థాన్‌కు కూడా వ్యాక్సిన్‌ను అందించిందంటే.. భారత్ దూరదృష్టి.. ప్రపంచ దేశాల ప్రజల పట్ల ఉన్న ఔదార్యాన్ని లెక్కించడం.. అంచనా వేయడం అగ్రరాజ్యానికి సాధ్యమేనా? అనేది భారతీయు ప్రశ్న. వాస్తవానికి అమెరికా ఉద్దేశం ఏంటి? ఆదేశం విధానం ఏంటి? అంటే.. ప్రతి దేశం కూడా ఎప్పుడూ.. కష్టాల్లో ఉండాలి. ప్రతిదానికీ ఆ దేశంపై ఆధారపడాలి. వారి అదుపు ఆజ్ఞల్లో ఉండాలని కోరుకుంటుంది.
ఎప్పుడు.. ఎక్కడ ఏ దేశంలో యుద్ధం జరిగినా.. దానికి కారణం .. అమెరికానే. తాజాగా ఉక్రెయిన్ తగలబడుతోందంటే.. రష్యాను రెచ్చగొట్టడం కాదా? ఉక్రెయిన్ కు అండగా ఉంటామని.. అంటూనే చేతులు ఎత్తేసింది ఏదేశం? అగ్రరాజ్యం కాదా? చితి మంటల్లో చలికాచుకునే తత్వం అగ్రరాజ్యానిది కాదా? అని భారతీయులు నిలదీస్తున్నారు. తమను నాటోలో చేర్చుకోమని.. ఉక్రెయిన్ అధ్యక్షుడు నెత్తీనోరూ కొట్టుకున్నా.. అమెరికా విన్నదా? చివరి వరకు సాగదీసి.. రష్యాను రెచ్చగొట్టి.. చివరకు .. నాటోలో చేర్చుకునేది లేదని చెప్పడం.. ఏం నీతి? అని భారతీయ పౌరులు ప్రశ్నిస్తున్నారు.
అమెరికా రగిల్చిన ఉక్రెయిన్-రష్యాల కుంపటి.. తాలూకు సెగలు.. పొగలు.. ప్రపంచాన్ని కుమ్మేస్తున్నాయి. నిత్యావసర ధరలు పెరిగిపోయాయి. ఆహా్ర ధాన్యాల కొరత ఏర్పడింది. రష్యాపై విధించిన ఆంక్షలు ప్రపంచ దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రష్యాలోఉత్పత్తి అయ్యే గోధుమలు.. ఎగుమతి చేయడానికి లేదు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఎగుమతులు నిలిచిపోయా యి. పలితంగా ప్రపంచ దేశాలు ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడింది. ఇక, నూనెల ధరలు ఆకాశన్నంటుతు న్నాయి. ఇన్ని జరుగుతుండడానికి కారణం.. అమెరికా కాదా? అని భారతీయ పౌరులు నిలదీస్తున్నారు.
ఇప్పటికే బైడెన్‌పై సొంత దేశంలోనే వ్యతిరేకత పెరిగిపోయింది. రష్యా యుద్ధోన్మాదానికి బైడెన్ ఆజ్యం పోస్తున్నాడంటూ.. వైట్ హౌస్ వద్దే.. వారం కిందట ఆందోళనలు జరిగాయంటే.. బైడెన్ పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందనే వాదనకు బలాన్ని చేకూరుస్తోందని అంటున్నారు. అలాంటి నాయకులు.. 'ప్రపంచ దేశాలకు గురువు'గా మారుతున్న భారత్‌పై వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలని వ్యాఖ్యానిస్తున్నారు.