Begin typing your search above and press return to search.
వాట్సాప్ కి బిగ్ షాక్
By: Tupaki Desk | 13 Feb 2018 9:52 AM GMTవాట్సాప్ లో డిజిటల్ ట్రాన్సాక్షన్లు చేసుకునేలా ఆసంస్థ కసరత్తులు చేసింది. కానీ దీన్ని కేంద్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది. భారత్ లో 200మిలియన్ల పైగా వినియోగదారుల్ని సొంతం చేసుకున్న వాట్సాప్ టెక్నాలజీకి అనుగుణంగా ఫీచర్స్ ను మారుస్తూ మార్కెట్ ను మరింత విస్తరించాలని భావించింది. అందులో భాగంగా ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లపై కన్నేసిన వాట్సాప్ పేటీఎం - గూగుల్ తేజ్ యాప్ డిజిటల్ చెల్లింపులకు ధీటుగా మార్కెట్ లో వాట్సాప్ నుంచి ట్రాన్సాక్షన్లు చేసుకునే సదుపాయాన్ని కల్పించేందుకు కసరత్తులు చేసింది.
తొలత వాట్సాప్ ప్రతినిధులు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ఆధ్వర్యంలో ఎస్ బీఐ - ఐసీఐసీఐ బ్యాంక్ - హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ - యాక్సిస్ బ్యాంక్ లతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఒప్పందం ప్రకారం డేటా భద్రతపై బ్యాంకులు సెక్యూరిటీ చెక్ చేశాయి. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే ఫిబ్రవరి నెలాఖరులోగా వాట్సాప్ నుంచి ఆన్ లైన్ పేమెంట్ చేసుకునే సదుపాయం అందరికి అందుబాటులోకి వచ్చేది.
కానీ వాట్సాప్ ఆన్ లైన్ పేమెంట్ ను కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకించింది. వాట్సాప్ వల్ల భద్రతా పరమైన ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తేల్చి చెప్పింది. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా వాట్సాప్ వ్యవహరిస్తుందని, ఆర్ధిక పరమైన సంస్థగా గుర్తింపులేనందున వాట్సాప్ లో ఆన్ లైన్ ట్రాన్సాక్షన్స్ ను వ్యతిరేకిస్తున్నట్లు సూచించింది.
వాట్సాప్ నుంచి ఆన్ లైన్ పేమెంట్ చేయాలంటే తొలత వినియోగదారులు తమ ఫోన్ నెంబర్ ను ఎస్ఎమ్ఎస్ ద్వారా ధృవీకరించాలి . అనంతరం సంబంధిత బ్యాంకుల్ని ఎంపిక చేసుకోవాలి. ఆ ప్రక్రియ తరువాత చెల్లింపు చేసుకోవచ్చు. ఇలా చెల్లింపులకు అనుమతి తీసుకోవాల్సి ఉండగా వాట్సాప్ నిబంధనలకు విరుద్దంగా వ్యహరిస్తుంది. వాట్సాప్ లైసెన్స్ పొందిన ఆర్థిక సంస్థ కాదని, పీఎస్పీతో ( Payment System Player) సంబంధం లేకుండా వ్యవహిరస్తున్నట్లు తెలిపింది. కాబట్టే వాట్సాప్ నుంచి ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లను వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేసింది.