Begin typing your search above and press return to search.
రాహుల్ మొండిపట్టు వాళ్లకు భలే నచ్చేస్తోంది
By: Tupaki Desk | 27 Aug 2018 7:23 AM GMTకీలకమైన సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కునేందుకు సరిగ్గా ఏడాది ముందు...గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఆఫ్ ఇండియా పేరున్న కాంగ్రెస్ పార్టీ రథసారథిగా బాధ్యతలు స్వీకరించిన గాంధీ కుటుంబ వారసుడు రాహుల్ గాంధీ తన సత్తాను చాటుకునేందుకు చెమటోడుస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో ఒక్కో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పుతుంటే..పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడం ఆయన ముందున్న మొదటి సవాల్ గా మారింది. ఆ ప్రక్రియను ఒకింత విజయవంతంగానే చేయగలిగారనే పేరును తెచ్చుకున్న రాహుల్..తర్వాతి దశలో తమ ప్రత్యర్థి అయిన బీజేపీ. ప్రధానమంత్రి నరేంద్రమోడీని ఎదుర్కునేందుకు పెద్ద ఎత్తున్నే కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో కేసులు - బెదిరింపులు వచ్చినా ఆయన లైట్ తీసుకుంటున్నారని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇందుకు తాజా నిదర్శనం..రాఫెల్ డీల్ పై రాహుల్ దూకుడు.
రాఫెల్ డీల్ ను రాబోయే ఎన్నికల ప్రచార అస్త్రంగా చేసుకొని ముందుకు సాగాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై తరచుగా విరుచుకుపడుతున్న రాహుల్ తీరును తప్పుపడుతూ రిలయన్స్ దిగ్గజం అనిల్ అంబానీ సహా ఆ గ్రూపులోని సంస్థలు భగ్గుమన్నాయి. అయినప్పటికీ మళ్లీ రాహుల్ ఘాటుగా స్పందించారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో - భారత జర్నలిస్టుల అసోసియేషన్ సభ్యులతోనూ రాహుల్ లండన్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాఫెల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ కుంభకోణం దాగుందని ఆరోపించారు. ఒప్పందానికి కేవలం 19 రోజుల ముందే ఏర్పడిన అనిల్ అంబానీకి చెందిన కంపెనీకి ఏకంగా రూ.45వేల కోట్ల కాంట్రాక్టును మోదీ ప్రభుత్వం అప్పగించిందని విమర్శించారు. తద్వారా తాను ఒక అంశాన్ని పట్టుకుంటే ఎంత ప్రతిఘటన ఎదురైనా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.
మరోవైపు తనపై వస్తున్న విమర్శలకు ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. మూడు తరాలుగా ప్రధాని పదవిలో గాంధీ కుటుంబమే ఉందంటూ బీజేపీ చేస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. 1991 తర్వాత గాంధీ కుటుంబానికి చెందిన వారెవరూ ప్రధాని పదవి చేపట్టలేదు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి అని అన్నారు.ఇంటి పేరు ఆధారంగా ఒక మనిషిని అంచనా వేయడం సరికాదని - వ్యక్తిగత సామర్థ్యం - పనితీరు ఆధారంగా అతడి ప్రతిభను గుర్తించాలని జర్నలిస్టులతో రాహుల్ అన్నారు. తాను గత 14-15 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని - ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. నేను వచ్చిన కుటుంబాన్ని చూసి వ్యతిరేకిస్తారో.. లేదంటే నా సామర్థ్యం ఆధారంగా నన్ను అంచనా వేస్తారో.. అది మీ ఇష్టం అని బదులిచ్చారు. కాంగ్రెస్ ను కుటుంబ పార్టీ అంటే తాను అంగీకరించనని పేర్కొన్నారు. స్థూలంగా రాహుల్ తమకు భవిష్యత్ నాయకులు అవుతాడనే భరోసాను ఆ పార్టీ నేతల్లో నింపుతున్నారని పలువురు నేతలు ధీమాను వ్యక్తం చేస్తున్నారు.