Begin typing your search above and press return to search.
గ్రాస్ రూట్ లెవెల్లోకి దూసుకుపోవాల్సిందే...జగన్ పక్కా వ్యూహం వెనక...?
By: Tupaki Desk | 10 Dec 2022 12:30 AM GMTజగన్ వచ్చే ఎన్నికలను సీరియస్ గానే తీసుకున్నారు. తనకు 2019 ఎన్నికల్లో జనాలు అప్పగించిన కుర్చీని అంత తేలికగా ప్రత్యర్ధులకు ఇచ్చే సమస్యే లేదని చెబుతున్నారు. నిజానికి అక్కడ చంద్రబాబు ఉన్నా అదే అంటారు. అధికారం మీద ఎవరికి మోజు ఉండదు. అందువల్ల ఎవరైనా తమకు తోచిన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తూ మరోసారి అధికారంలోకి రావాలనుకుంటారు.
జగన్ కూడా అదే చేస్తున్నారు. అయితే ఆయన ఈసారి కొత్తదారి పట్టుకున్నారు. ఇది ఏపీకి కొత్త కానీ దేశంలో చాలా చోట్ల బీజేపీ అమలు చేస్తున్న ఫార్ములావే. రాజకీయ నాయకులు ఎంతలా పాదయాత్రలు చేసినా మరెంతలా ఇల్లిల్లూ తిరిగినా కూడా వారు నేరుగా జనాలకు అయితే కలుసుకోలేరు. ఒకవేళ ఒకసారి కలుసుకున్నా అది నిరంతరం సాగే ప్రక్రియ కాదు.
అందుకే దీనికి విరుగుడుని జగన్ కనిపెట్టారు. డైరెక్ట్ ఇంట్రాక్షన్ విత్ ఓటర్స్ అన్నట్లుగా ఆయన ఆలోచించిన కొత్త ప్లాన్ గ్రామ సారధులు, ప్రతీ యాభై ఇళ్ళను ఒక క్లస్టర్ గా నిర్దేశించి దానికి ఇద్దరేసి వంతున పార్టీ కార్యకర్తలను కేటాయిస్తారు. అదే విధంగా ప్రతీ సచివాలయానికి ముగ్గురు వంతున కో ఆర్డినేటర్స్ ని నియమిస్తారు. ఇందులో ఒకరు మహిళ తప్పనిసరిగా ఉంటారు.
వీరంతా కలసి పార్టీని జనంలో ప్రచారం లో ఉండేలా చూస్తారు. ప్రతీ రోజూ పార్టీకి సంబంధించిన గ్రామ సారధులు ఇంటింటికీ వెళ్తే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సచివాలయ సమన్వయ కర్తలు కూడా వెళ్తారు. ఇలా వీరంతా కలసి ప్రజలతో మమేకం కావడం ద్వారా పార్టీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటారు. లోపాలు లోటుపాట్లు పూర్తిగా క్షేత్ర స్థాయిలో ఎక్కడ ఉన్నాయో నేరుగా వచ్చి పార్టీకి చేరిపోతాయి.
దాంతో వాటిని రిపేర్లు ఎప్పటికపుడు చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది. ఈ విధంగా దాదాపు రెండు కోట్ల మంది ప్రజలను నేరుగా కనెక్ట్ కావడం అన్నది వైసీపీ టార్గెట్. ఇది కాగితాల మీద రాసుకోవడానికి మీటింగులో చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. ఇదే కనుక వర్కౌట్ అయితే రాజకీయ పార్టీగా వైసీపీ సక్సెస్ సాదించినట్లే. ఎందుకంటే ఇదే విధానాన్ని బీజేపీ అమలు చేస్తూ చాలా చోట్ల గెలుస్తోంది. వారు స్టేట్ లెవెల్ లో అగ్ర నేతలతో మీటింగులతోనే వదిలేయరు.
గ్రాస్ రూట్ లెవెల్ లో నిత్యం అనుసంధానం అవుతూ ఉంటారు. ఆ విధంగా పార్టీ నెట్ వర్క్ బలంగా ఉంటుంది. ఇపుడు అలాంటి దాన్నే అడాప్ట్ చేసుకోవడం ద్వారా వైసీపీ మరో సారి అధికారంలోకి రావాలని చూస్తోంది. దీని వల్ల వైసీపీకి రాజకీయ లాభం ఏంటి అంటే పోల్ మేనేజ్మెంట్ ని కచ్చితంగా చేసుకోగలుగుతుంది. తన క్లస్టర్ పరిధిలో ఉన్న యభై కుటుంబాలు అంటే సుమారుగా రెండు వందల ఓట్లు ఉంటాయి. వాటికి ఇద్దరేసి గ్రామ సారధులు పార్టీ తరఫున ఉంటారు. కాబట్టి చెరి వంద వంతువ విభజించుకున్నా ఆ వందమందినీ పోలింగ్ బూత్ కి తీసుకువచ్చి తమ పార్టీకి అనుకూలంగా ఓట్లు వేయించుకోగలిగితే గెలుపు కచ్చితం అని వైసీపీ భావిస్తోంది.
ఇక వీరు ప్రభుత్వ పథకాలను కూడా నేరుగా జనాలకు వివరిస్తూ పార్టీ పట్ల ప్రభుత్వం పట్ల అనుకూలతను తీసుకువచ్చే ప్రయత్నం చేస్తారు. అలాగే కరపత్రాలను ప్రభుత్వ కార్యక్రమాలను కూడా వారు వివరిస్తూ ఉంటారు. సమస్య ఏది ఉన్నా తమే జనాల ఇళ్ల వద్దకు వెళ్తారు కాబట్టి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారితో చెప్పుకుంటే ప్రభుత్వం ఉంది కాబట్టి చెప్పి చేయిస్తారు.
నిజానికి వైసీపీకి అధికారంలోకి వస్తూనే 2 లక్షల అరవై వేల మంది వాలంటీర్లను నియమించింది. వారంతా దాదాపుగా వైసీపీ అనుకూలురు, మద్దతుదారులే ఉన్నారు. వారితోనే చాలా పని చేయించుకుంటూ వస్తున్నారు. అయితే ఎన్నికల వేళ వాలంటీర్లతో పని జరగదు, వారిని ఈసీ కట్టడి చేస్తుంది. దాంతో మరో ఇద్దరిని అలా క్లస్టర్స్ గా పేర్కొనే ప్రతీ యాభై ఇళ్ళకు పంపించడం. ఇలా పార్టీకి సంబంధించి అతి పెద్ద సైన్యాన్ని జగన్ సిద్ధం చేసి ఉంచారని అంటున్నారు.
ఇక్కడ మరో తమాషా ఉంది. ఎమ్మెల్యేలు గడప గడపకూ తిరుగుతున్నారు. అయితే వారంతా కూడా మొక్కుబడిగానే తిరుగుతున్నారు అన్న చర్చ ఉంది. ఇక చూస్తే రేపటి రోజున వారికి టికెట్లు దక్కకపోవచ్చు. అలాంటపుడు ఎమ్మెల్యేలు ఎంత తిరిగినా కొత్తగా వచ్చిన వారు టికెట్లు దక్కిన వారు మొదటి నుంచి పని ప్రారంభించాలి. దాంతో వారికి చేదోడు వాదోడుగా ఉండడానికే ఈ కొత్త నెట్ వర్క్ ని తెచ్చి పెట్టారని అంటున్నారు. రేపటి రోజున ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు ప్రజా ప్రతినిధులు ఉన్నా వారు శాశ్వతం కాదు కానీ ఈ నెట్ వర్క్ మాత్రం పార్టీలో శాశ్వతంగా ఉంటుంది. అందువల్ల పార్టీ ఎపుడూ బలంగా ఉంటుంది.
అందుకే ఈ కాన్సెప్ట్ ని జగన్ తెచ్చారని అంటున్నారు. అయితే చేయాల్సిన పని అంతా నాయకుల మీదనే ఉంది. వారే క్యాడర్ ని వెతికి పట్టుకుని ఇలా జనాల ఇళ్ళ వద్దకు నడిపించాలి. అది చాలా పెద్ద ప్రయత్నం. గడపగడప మాదిరిగా అది మొక్కుబడి ఎంపికగా తంతుగా ఉంటుందా లేక పూర్తి యాక్షన్ ప్లాన్ తో సాగుతుందా అన్నది చూడాలి. అది పక్కాగా జరిగితేనే జగన్ అనుకున్నది సాధించగలరు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.