Begin typing your search above and press return to search.

డ‌బ్బు ఉంటేనే.. టీడీపీలో ఎమ్మెల్యే సీట్‌!!

By:  Tupaki Desk   |   4 July 2022 10:46 AM GMT
డ‌బ్బు ఉంటేనే.. టీడీపీలో ఎమ్మెల్యే సీట్‌!!
X
ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీలో టికెట్లు ఆశిస్తున్న వారికి ఇది ఒక ర‌కంగా షాకింగ్ న్యూసే అని చెప్పాలి. అం తేకాదు.. ఇప్ప‌టి వ‌ర‌కు లేని ఒక వాద‌న తెర‌మీదికి వ‌స్తుండ‌డం కూడా.. ఆశావ‌హ నాయ‌కుల‌కు.. ఇబ్బంది గానే మారింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు. అదే.. వ‌చ్చే 2024 ఎన్నికల్లో.. టీడీపీ త‌ర‌ఫున టికెట్ ఆశించే నాయ‌కుల‌కు.. పార్టీ అధిష్టానం ఒక విష‌యాన్ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పింద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అదే.. ''డ‌బ్బు''. వ‌చ్చే ఎన్నిక‌ల్లో డ‌బ్బులు ఉంటేనే టికెట్.. అని తేల్చి చెప్పార‌ట‌.

ముఖ్యంగా గ‌త మేలో ప్ర‌కాశం జిల్లాలో మ‌హానాడు నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా.. కొంద‌రు నాయ‌కు లు.. ముఖ్యంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్న వారు.. చంద్ర‌బాబు, ఆయ‌న కుమారుడు.. టీడీపీ జాతీ య ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్‌తో మాట్లాడారు. త‌మ‌కు టికెట్ కావాల‌ని వారు కోరార‌ట‌. అయితే.. చంద్ర‌బాబు, లోకేష్‌లు మాత్రం డ‌బ్బులు ఉంటేనే టికెట్ ఇస్తామ‌ని.. తేల్చి చెప్పార‌ని.. పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది.

అంతేకాదు.. పార్టీ కోసం.. ఖ‌ర్చు పెట్ట‌కుండా.. కార్య‌క్ర‌మాలు కూడా నిర్వ‌హించ‌కుండా.. ఉంటే.. సీటు ఇ చ్చేది లేద‌ని కుండ‌బ‌ద్ద‌లు కొట్టార‌ట‌. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అంటే 2024లో వైసీపీతో గ‌ట్టి పోటీ ఉంటుంద‌ని, దీ నిని త‌ట్టుకోవాలన్నా.. గెలుపు గుర్రం ఎక్కాల‌న్నా.. ఖ‌చ్చితంగా డ‌బ్బులు అత్యంత ప్ర‌ధాన పాత్ర పోషిస్తా య‌ని చెప్పార‌ట‌. ఒక్కొక్క ఎమ్మెల్యేకి.. వైసీపీ.. అదినేత జ‌గ‌న్ బాగా డ‌బ్బులు ఇస్తాడ‌ని.. టీడీపీ వ‌ర్గాల‌కు స‌మాచారం ఉంద‌ని తెలుస్తోంది.

టీడీపీ కూడా అంతే డ‌బ్బు పెట్టాల‌ని..లేక పోతే.. పోటీ ఇచ్చే ప‌రిస్థితి ఉండ‌ద‌ని.. ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే డ‌బ్బులు ఉన్న‌వారినే.. సెల‌క్ట్ చేయాల‌ని.. చూస్తున్నార‌ట‌. ఎందుకం టే.. వైసీపీ అధిష్టానం.. ఇప్ప‌టి వ‌ర‌కు బీజేపీతో ప‌రోక్షంగా క‌లిసి ముందుకు సాగుతోంద‌ని.. జ‌గ‌న్ మీద ఉన్న కేసుల విష‌యంలో మోడీ కూడా ఏది చెబితే అదే వింటున్నార‌ని.. టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆ నేప‌థ్యంలో బీజేపీ ఎలాగూ.. టీడీపీకి స‌పోర్టు, ఆర్థిక స‌పోర్టు కూడా క‌ట్ చేస్తుంద‌ని.. అంటున్నారు.

కాబ‌ట్టి.. ఖ‌చ్చితంగా డ‌బ్బు ఉన్న వాళ్ల‌నే.. టీడీపీ సెల‌క్ట్ చేస్తుంద‌ని.. నిర్ణ‌యానికి వ‌చ్చార‌ని తెలిసింది. ఇటీవ‌ల ప్ర‌కాశం జిల్లాలో ఉన్న ఇంచార్జ్‌లు డ‌బ్బు ఖ‌ర్చు పెట్ట‌కుండా.. యాక్షన్ చేస్తున్న‌వారిని ప‌క్క‌న పెట్టాల‌ని.. చెప్పార‌ట‌. కేవ‌లం మాట‌లు చెప్ప‌డం.. అధినేతను పొగ‌డ‌డం వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతున్న‌వారికి కూడా చెక్ పెట్టాల‌ని.. సూచించార‌ట‌.

ఈ నేప‌థ్యంలోనే ఈ ఫార్ములానుఉ రాష్ట్ర వ్యాప్తంగా అమ‌లు చేయాల‌ని.. టీడీపీ అధినేత అనుకుంటున్న ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలో టీడీపీ ఆర్థికంగా ఎలా హ్యాండిల్ చేస్తుందో.. చూడాల‌ని.. అంటున్నాయి.. ఆ పార్టీ వ‌ర్గాలు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.