Begin typing your search above and press return to search.

మోడీ గుడ్ మార్నింగ్ చెప్పినా పిచ్చ లైట్‌!

By:  Tupaki Desk   |   29 Dec 2017 5:05 AM GMT
మోడీ గుడ్ మార్నింగ్ చెప్పినా పిచ్చ లైట్‌!
X
మీరు చ‌దివింది నిజ్జంగా నిజం. సాక్ష్యాత్తు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గుడ్ మార్నింగ్ అని చెప్పినా..రియాక్ట్ అయ్యే ఎంపీలు న‌లుగురైదుగురు కంటే ఎక్కువ ఉండ‌ర‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విష‌యాన్ని ఎవ‌రో కాదు.. మోడీనే స్వ‌యంగా చెప్పుకోవ‌టం గ‌మ‌నార్హం. ఈ ఆస‌క్తిక‌ర విష‌యాన్ని మోడీ ప్ర‌స్తావిస్తూ.. పార్టీ ఎంపీల‌కు త‌లంటు పోసే కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు.

పార్ల‌మెంటరీ పార్టీ స‌మావేశాన్ని తాజాగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మోడీ.. ఎంపీలు త‌న‌తో మాట్లాడ‌టానికి అధికారిక మొబైల్ యాప్ (న‌మో యాప్‌)ను విరివిరిగా ఉప‌యోగించాల‌ని సూచన చేశారు. వివిధ అంశాల మీద స‌ల‌హాలు.. అభిప్రాయాల్ని వెల్ల‌డించొచ్చ‌ని చెప్పిన ఆయ‌న‌.. తాను గుడ్ మార్నింగ్ అని చెప్పినా.. న‌లుగురైదుగురు ఎంపీలు త‌ప్పిస్తే.. మిగిలిన వారు ఎవ‌రూ స్పందించ‌టం లేద‌న్నారు.

ప్ర‌ధాన‌మంత్రి స్వ‌యంగా గుడ్ మార్నింగ్ చెప్పినా.. పార్టీ ఎంపీలు రియాక్ట్ కాక‌పోవ‌టానికి కార‌ణం.. టెక్నిక‌ల్ గా అప్డేట్ కాక‌పోవ‌టం ఒక ఎత్తు అయితే.. యాప్ ల‌ను ఉపయోగించే విష‌యంలో వెనుక‌బ‌డి ఉండ‌టం.. పెద్ద‌గా ఆస‌క్తి లేక‌పోవ‌టంగా ప‌లువురు చెబుతున్నారు. ప్ర‌ధానే త‌న‌కు తానుగా.. నోరు తెరిచి మ‌రీ తాను చెప్పే గుడ్ మార్నింగ్‌ కు రియాక్ట్ కావాల‌ని కోరిన నేప‌థ్యంలో బీజేపీ ఎంపీలు ఎలా స్పందిస్తారో చూడాలి. మోడీ సంగ‌తేమో కానీ.. ఇప్పుడు మొబైల్ ను మాట్లాడ‌టానికి కాకుండా.. యాప్ లు ఉప‌యోగించ‌టానికి.. అభిప్రాయాలు వెల్ల‌డించ‌టానికి ఉప‌యోగించుకోవ‌టం కాస్త క‌ష్ట‌మే. మ‌రి.. దీన్ని నేత‌లు ఎలా అధిగ‌మిస్తారో చూడాలి.