Begin typing your search above and press return to search.

బీఫ్ తినటానికి..ఫెస్టివ‌ల్స్ అవ‌స‌ర‌మా?: వెంక‌య్య‌

By:  Tupaki Desk   |   19 Feb 2018 4:49 PM GMT
బీఫ్ తినటానికి..ఫెస్టివ‌ల్స్ అవ‌స‌ర‌మా?: వెంక‌య్య‌
X
భార‌త‌దేశవ్యాప్తంగా బీఫ్ తినాలా? వ‌ద్దా? అన్న అంశంపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు జ‌రిగిన సంగతి తెలిసిందే. ఈ విష‌యంపై దేశ ప్ర‌జ‌లు వ‌ర్గాలుగా విడిపోయి చ‌ర్చోప‌చ‌ర్చ‌లు - డిబేట్ లు జ‌రిపారు. కొంత‌మంది విద్యార్థులు.....కేంద్ర ప్ర‌భుత్వ నిర్ణ‌యానికి వ్య‌తిరేకంగా యూనివ‌ర్సిటీలలో బీఫ్ ఫెస్టివ‌ల్స్ కూడా నిర్వ‌హించారు. బుద్ధిగా చ‌దువుకోవాల్సిన విశ్వ‌విద్యాల‌యాల్లో విద్యార్థులు .....ఇలా బీఫ్ ఫెస్టివ‌ల్స్ నిర్వ‌హించ‌డంపై ప‌లువురు తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్తం చేశారు. తాజాగా, ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య‌నాయుడు ఈ బీఫ్ ఫెస్టివ‌ల్స్ పై ఘాటుగా స్పందించారు. బీఫ్ తినాల‌నుకున్న వారు తినొచ్చ‌ని - అయితే వాటికంటూ ప్ర‌త్యేకంగా ఫెస్టివ‌ల్స్ నిర్వ‌హించ‌డం ఏమిటని వెంక‌య్య అన్నారు. ఓ కాలేజీ ప్లాటినం జూబ్లీ సెలబ్రేషన్స్‌ లో పాల్గొన్న ఆయ‌న అనేక ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు.

ఈ సంద‌ర్భంగా కిస్ ఫెస్టివ‌ల్స్ పై కూడా వెంక‌య్య మండిప‌డ్డారు. యూనివర్సిటీల‌లో 'కిస్ ఫెస్టివల్` క‌ల్చ‌ర్ కూడా పెరిగిపోతోంద‌ని - ముద్దు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవాల‌ని - దానిని వ్య‌క్తిగ‌త వ్య‌వహారంగా చూడాల‌ని సూచించారు. దానికి ఇతరుల అనుమతి తీసుకోవాల్సిన అవ‌సరం లేద‌న్నారు. ప్ర‌త్యేకంగా ఫెస్టివల్ నిర్వ‌హించాల్సిన అవ‌స‌ర‌ముందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. పార్లమెంటుపై దాడి చేసిన‌ అఫ్జల్ గురు పేరును కొందరు జ‌పిస్తున్నార‌ని, అత‌డు పార్లమెంటును పేల్చేసే ప్రయత్నం చేశాడ‌ని మ‌ర్చిపోకూడ‌ద‌న్నారు. ఏం తినాలి...తిన‌కూడ‌దు అన్న‌ది....వ్యక్తుల ఇష్టాఇష్టాలకు సంబంధించినదని, ఆ విష‌యం గురించి మ‌రొకరు ఆదేశించే హ‌క్కు లేద‌ని వెంక‌య్య గ‌తంలో వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.