Begin typing your search above and press return to search.

ఈ వీడియో చూశారంటే.. బయట చపాతీలు తినాలంటేనే భయపడతారు..!

By:  Tupaki Desk   |   21 Feb 2021 11:30 AM GMT
ఈ వీడియో చూశారంటే.. బయట చపాతీలు తినాలంటేనే భయపడతారు..!
X
పెళ్లిల్లు, ఇతర వేడుకల్లో ఏర్పాటు చేసే విందులో చపాతీలు పెట్టడం కామనే. ఇటీవల చాలా మంది ఆరోగ్యం దృష్ట్యా చపాతీలే తింటున్నారు. బరువు తగ్గాలనుకొనేవాళ్లు.. షుగర్​ లాంటి సమస్యలు ఉన్నవాళ్లు కూడా రాత్రిపూట అన్నం మానేసి చపాతీలు తీసుకుంటున్నారు.

అయితే ఓ పెళ్లి వేడుకలో చపాతీలు చేస్తున్న ఓ వ్యక్తి ఉమ్మి వేసి వాటిని కాల్చాడు. పెళ్లికి వచ్చినవాళ్లంతా చపాతీలు ఆరగించారు కూడా. ఆ తర్వాత ఆ వీడియో బయటకు వచ్చింది. అసలు ఆ వ్యక్తి ఎందుకు అలా చేశాడో? ఎవరికీ అర్థం కావడం లేదు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్​గా మారింది.

ఉత్తరప్రదేశ్‌… మీరట్‌లో జరిగిన ఓ పెళ్లి విందులో ఈ ఘటన చోటుచేసుకున్నది. ఇప్పుడు ఈ వీడియో దేశం మొత్తం వైరల్​గా మారింది. ఇటువంటి వ్యక్తులను అసలు క్యాటరింగ్​లో పెట్టుకోవద్దని.. చాలా మంది నెటిజన్లు కామెంటు పెడుతున్నారు.

పోలీసులు కూడా ఈ ఘటనపై ఆరా తీశారు. నౌషద్​ అనే వ్యక్తి ఇలా పెళ్లి క్యాటరింగ్​లో ఉమ్మి వేసి చపాతీలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే సదరు వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ మొదలుపెట్టారు. ఎందుకలా చేశావు? అంటూ ప్రశ్నించారు.

అయితే నౌషద్​ మాత్రం తనకేపాపం తెలియదని .. కావాలనే కొంతమంది తనను ఇరికించారని చెబుతున్నాడట. అయితే సదరు వీడియో చూపించినా కూడా నౌషద్​ అలాగే బుకాయిస్తున్నాడట. అసలు ఈ వీడియోలో ఉంది తాను కాదు అని చెబుతున్నాడట. దీంతో పోలీసులు అతడి మానసిక స్థితిపై ఆరా తీస్తున్నారు.