Begin typing your search above and press return to search.
కరోనా గురించి ఈ జంటకి అసలు తెలియదట !
By: Tupaki Desk | 24 April 2020 2:30 AM GMTఅదేంటి ..గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది కదా, ఈ కరోనా గురించి తెలియని వారు కూడా ఉన్నారా ? అని ఆశ్చర్యపోతున్నారా ? నిజమే కరోనా భయంతో ప్రపంచం మొత్తం బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటే ఆ జంట అసలు ఈ విషయమే తెలియకుండా సాగరంలో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారట.
పూర్తి వివరాలు చూస్తే ..యూకేలోని మాంచెస్టర్‌కి చెందిన ఎలెనా మణిశెట్టి - ర్యాన్ ఒస్బోర్న్ 2017లో తమ ఉద్యోగాలకి రిజైన్ చేసి ఒక బోట్ ని కొనుక్కున్నారు. ఇందులో ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణిస్తూ ఇంట్లో వాళ్లతో అప్పుడప్పుడు టచ్ లోకి వెళ్తుంటారు. అయితే ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ..తమకి బ్యాడ్ న్యూస్ ఏవి చెప్పకూడదనే నిబంధన కూడా వారు పెట్టారట. దీనితో ఆ విషయాన్ని వారికీ చెప్పలేదు.
ఈ తరుణంలోనే గత నెలలో కానరీ దీవుల నుంచి కరేబియన్ వరకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, కరోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించగా, దీంతో అనేక దేశాలు తమ సరిహద్దులని ఇప్పటికే మూసివేశాయి. కరేబీయన్ దీవులకి చేరుకున్న ఈ జంట దాని సరిహద్దు మూసి ఉందని తెలిసి షాక్ కి గురైయ్యారు. ఆ తరువాత కరేబియన్ ద్వీపం సరిహద్దులు మూసి ఉన్నట్లు తెలుసుకున్న వీరిద్దరు తమ నౌకను గ్రెనడాకు మళ్లించారు, అక్కడ వారు చివరకు ఇంటర్నెట్ కనెక్షన్ పొందగా..కరోనా మహమ్మారి గురించి వారికి తెలిసింది.