Begin typing your search above and press return to search.
సీఎంకు యువకుడి థ్యాంక్స్.. మీ లాక్ డౌన్ పొడిగింపుతో నా లవర్ పెళ్లి ఆగిపోతుంది
By: Tupaki Desk | 22 May 2021 3:43 AM GMTఓ యువకుడు ముఖ్యమంత్రికి చేసిన విజ్ఞప్తి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన జరిగింది ఒడిశాలో.. కరోనా లాక్డౌన్ విషయంలో బీహార్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల లాక్డౌన్, కఠిన ఆంక్షలు కూడా విధించింది. అయితే ఈ సందర్భంగా ఓ యువకుడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో నవ్వులు పూయించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. మే 13న బిహార్లో లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా సీఎం నితిశ్ కుమార్ రాష్ట్రంలో కఠిన ఆంక్షలు విధిస్తున్నట్టు ప్రకటించారు. సీఎం నితీశ్ ఓ ట్వీట్ చేశారు..
‘రాష్ట్రంలో ఇప్పటికే లాక్డౌన్ అమలవుతున్న విషయం తెలిసిందే. లాక్డౌన్ వల్లే కేసులు తగ్గుతున్నాయి. దీంతో లాక్డౌన్ పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మరో 10 రోజుల పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నాము. అంటే మే 16 నుంచి 25 వరకు లాక్డౌన్ కొనసాగిస్తున్నాం’ అంటూ ట్విట్ చేశాడు. ఈ ట్వీట్ కు పంకజ్ గుప్తా అనే ఓ యువకుడు గమ్మత్తైన రిప్లై ఇచ్చాడు. ‘సార్ లాక్డౌన్ విధించి మంచి పని చేశారు. సరిగ్గా ఇదే టైంలో నా ప్రియురాలికి పెళ్లిపెట్టుకున్నారు. మీరు లాక్డౌన్ విధించడం వల్ల ఈ పెళ్లి ఆగిపోతుంది. నేను మీకు ఎంతో రుణపడి ఉంటాను సార్. థ్యాంక్యూ సార్’ అంటూ పంకజ్ ట్వీట్ పెట్టాడు. ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఫేస్బుక్, వాట్సాప్లో ఈ ట్వీట్ ట్రెండింగ్లో నిలిచింది. నెటిజన్లు ఎమోజీలతో కామెంట్లు, షేర్స్ చేస్తున్నారు. ఈ ట్వీట్ కు వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. మరోవైపు మనదేశంలో కరోనా కేసులు రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 2.59 లక్షల తాజా కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. 4,200 మందికి ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో 35,579 కేసులు నమోదయ్యాయి. 30,491 కేసులతో కేరళ రెండో స్థానంలో ఉంది. ఇక ఏపీలో 22,610 కేసులు నమోదయ్యాయి.