Begin typing your search above and press return to search.
సెప్టెంబర్ 17 ఏంటి? గూగుల్ లో ఇప్పుడు యువత ఇదే సెర్చ్
By: Tupaki Desk | 17 Sep 2022 5:35 AM GMTసెప్టెంబర్ 17. ఇది అప్పటి కాలం వారికి బాగా గుర్తు. ఆ నెత్తుటి నిజాం రాక్షస పాలన నుంచి విముక్తి పొందిన బాధితుల కష్టాలు కథలు కథలుగా చెబుతుంటారు. భారతదేశం మొత్తం ఆగస్టు 15న స్వాతంత్ర్య సంబరాలు చేసుకుంటుంటే.. దేశం మధ్యలోని నిజాం నిరంకుశ పాలనలోని హైదరాబాద్ సంస్థానం చిమ్మి చీకట్లలో బానిసత్వంలో బతికింది. నిజాం రజాకర్ల దురాగతాలకు బలి అవుతూ ఉంది. కానీ భారత ఉపప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానంపై దండెత్తి భారతదేశంలో విలీనం చేశారు. తెలంగాణ ప్రాంతానికి నిజమైన స్వాతంత్య్రాన్ని అందించారు. అంటే భారతదేశంలోని ప్రజల కంటే తెలంగాణ ప్రజలు ఒక సంవత్సరం పాటు ఇంకా స్వాతంత్య్రానికి దూరంగా నిజాం నిరంకుశ పాలనలో మగ్గారు. నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం సహా ఎన్నో పోరాటాలు సాగాయి. ఎంతో మంది అమరులు అయ్యారు. జైలు పాలయ్యారు.
సెప్టెంబర్ 17 గురించి నాటి వారికి తెలిసినా.. నేటి యువతకు మాత్రం దీని గురించి ఏమీ తెలియదు.. సెప్టెంబర్ 17 గురించి తెలంగాణ యువత ఇప్పుడు గూగుల్ లో వెతుకుతోంది. తెలంగాణలోని యువతతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు 'సెప్టెంబర్ 17' గురించే వెతుకుతున్నారు. అసలు ఈ సెప్టెంబర్ 17 ఏంటి? ఎప్పుడూ ఇలాంటి కార్యక్రమాలు లేవు.. అసలు విలీనం, విమోచనం, సమైక్యం ఏంది అని ఆరాతీస్తున్నారు. ఈ లొల్లి అంతా కేవలం ఓట్ల కోసమా? అని నిలదీస్తున్నారు.
బీజేపీ గత 8 సంవత్సరాలుగా ఎందుకు ఈ విమోచన వేడుకను చేయలేదు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్ ఎందుకు బీజేపీకి పోటీగా చేస్తోందని యువత , తెలంగాణ ప్రజల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవం పేరిట కేంద్రహోంమంత్రి, కర్ణాటక, మహారాష్ట్ర సీఎంలు కలిసి హైదరాబాద్ లో ప్రశాంత వాతావరణాన్ని చెడగొడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక విద్వేషాన్ని రగల్చడం తప్పితే ఇందులో అసలు ఏముందని ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణ విమోచనం అన్నది ప్రజలంతా గుర్తుంచుకోవాల్సిన పండుగ. దీన్ని కేసీఆర్ అధికారంలోకి వస్తే చేస్తానన్నారు. కానీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఫణంగా పెట్టారు. ఇప్పుడు ఇదే బీజేపీకి వరమైంది. ఓ వర్గానికి వ్యతిరేకమైన ఆ పార్టీ ఇంత మంకు పట్టు పట్టి ఇటు టీఆర్ఎస్ ను.. అటు ఎంఐఎం లాంటి ఆ వర్గాన్ని టార్గెట్ చేస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా బీజేపీ విమోచన దినోత్సవాలకు భయపడి 'జాతీయ సమైక్యత దినోత్సవం' అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. ఈరోజు బీజేపీ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేయాలని కేంద్రప్రభుత్వం తరుఫున ఆదేశాలిచ్చింది.కానీ కేసీఆర్ నిన్న రాత్రికి రాత్రి వీటన్నింటినికి సెలవు ప్రకటించారు.
దీంతో ఈ టిట్ ఫర్ టాట్ లొల్లి బీజేపీ, టీఆర్ఎస్ పాలిటిక్స్ మధ్యన ప్రజలు నలిగిపోతున్న పరిస్థితి నెలకొంది. వారి స్వార్థ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.