Begin typing your search above and press return to search.
ఆర్థిక వ్యవస్థ బాగుకు యువత కదిలి రండి..
By: Tupaki Desk | 18 April 2020 2:30 AM GMTభారతదేశానికి ఉన్న బలం ఏమిటంటే యువత. ప్రపంచంలోనే అత్యధికంగా భారతదేశంలో యువశక్తి ఉంది. అందుకే భారతదేశ ప్రగతిలో యువతనే ప్రధానంగా ఉంది. అన్ని రంగాల్లో ప్రస్తుతం యువత రాణిస్తోంది. ఉక్కు బలం.. ఉడుకు రక్తం.. ధృడసంకల్పం తదితర లక్షణాలతో యువత ప్రస్తుతం దేశంలో కీలకంగా ఉంది. ఇప్పుడు ఆ యువతను కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగస్వాములను చేసుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం కరోనాతో ఆర్థిక వ్యవస్థతో చిన్నాభిన్నమైన పరిస్థితిలో యువత సేవలు వినియోగించుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ప్రస్తుతం లాక్ డౌన్ ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం సడలిస్తోంది. వివిధ రంగాల్లో ప్రస్తుతం సడలింపులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక వ్యవస్థను గాడీలో పెట్టేందుకు యువతను వినియోగించుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం భారదేశ జనాభాలో 85 శాతం యువజనులే ఉన్నారు. వారిలో రోగ నిరోధక శక్తి అధికంగా ఉంటుంది.. కరోనా వారికి సోకడం చాలా తక్కువ. ప్రస్తుతం కీలక రంగాల్లో సడలింపులు ఇస్తున్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ సాధారణ స్థితికి వచ్చేలా వారి సేవలు పొందాలని విశ్లేషకులు సూచిస్తున్నారు. కరోనా కేసులు లేని చోట్ల ఆయా రంగాల్లో యువశక్తిని ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉందని సమాచారం.
ప్రస్తుతం భారతదేశంలో 529 జిల్లాల్లో 60 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవారు 85 శాతం ఉన్నారని అంచనా. వీరిలో చాలామంది ప్రభుత్వం గ్రీన్ జోన్ గా గుర్తించిన 353 జిల్లాల్లో ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. ఈ జిల్లాల్లో అసలు కరోనా కేసులు లేకపోవడంతో మొదట ఇలాంటి ప్రాంతాలను గుర్తించి ఈ జిల్లాలోని యువకులను ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారంట. వారి సేవలు వినియోగించుకుని భారతదేశం తిరిగి పుంజుకునేలా చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఈ విధంగా భారతదేశ సేవల్లో మరోసారి యువత కీలక పాత్ర పోషించడం ఆహ్వానించదగ్గ పరిణామం.