Begin typing your search above and press return to search.
'యువశక్తి'.. ఓటు బ్యాంకుగా మారేనా...?
By: Tupaki Desk | 12 Jan 2023 7:54 AM GMTఏపీలో అన్ని కీలక పార్టీలూ జపిస్తున్న ఏకైక మంత్రం యువశక్తి. దేశంలో యువ శక్తి పెరిగిందని.. దీనిని రాజకీయంగా వాడుకోవాలని.. ఒకవైపు టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. ఆది నుంచి కూడా చంద్రబాబు యువతకు పెద్దపీట వేస్తానని చెబుతున్నారు. అంతేకాదు.. పార్టీ పదవుల్లోనూ 33 శాతం వారికి కేటాయిస్తాననని చెప్పారు. అయితే.. దీనిని ఎంతవరకు ? అమలు చేశారనేది పక్కన పెడితే.. యువతకు మాత్రం పెద్దపీట వేస్తానని చెబుతున్నారు.
ఇక, ఇప్పుడు పవన్ కూడా ఇదే ఫార్ములాను ఎంచుకున్నారు. యువతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపా రు.. ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో యువశక్తి పేరిట భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. అయితే.. యువ శక్తికి కొదవలేని మాట వాస్తవమే అయినా.. సభలు, సమావేశాలకు వారు వస్తున్నది కూడా నిజమే అయినా.. వారిని ఓటు బ్యాంకుగా మార్చడంలో ఈ పార్టీలు విఫలమవుతున్నాయి.
ఉదాహరణకు గత ఎన్నికల్లో యువత పెద్దగా ఓటు వేయలేదు. గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. అది కూడా పెద్దలు, వయోవృద్ధులు మాత్రమే ఓటు వేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా యువత అదే పంథాలో ఉంటుందని మేథావులు చెబుతున్నారు. యువశక్తి ఉన్నప్పటికీ.. రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్న వారు చాలా తక్కువ. వారిలోనూ ఓటు వేస్తున్నవారు ఇంకా తక్కువగా ఉంది.
ఈ నేపథ్యంలో యువ శక్తిని ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రయత్నాలు చేసే వరకు పార్టీలకు ప్రయోజనం ఉండదని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలు యువతను ఓటు బ్యాంకుగా మార్చే ప్రయత్నాలు సాగాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా పవన్ వంటి వారు ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.