Begin typing your search above and press return to search.
తాత పేరు పీతకు పెట్టాడు
By: Tupaki Desk | 27 Feb 2016 9:28 AM GMT బాల్ ఠాక్రే... దేశ రాజకీయాల్లో ఆ పేరు ఒక సంచలనం. ఆ పేరు వినగానే ఆయన వ్యతిరేకులు కూడా ఒక్కసారి ఆయన్ను స్మరించుకుంటారు. మహారాష్ట్రకే పరిమితమైన శివసేనకు దేశవ్యాప్త గుర్తింపు తెచ్చిన బాల్ ఠాక్రే వల్ల ఠాక్రే అన్న పేరుకు ఎక్కడలేని ప్రాముఖ్యం వచ్చేసింది. ఇప్పుడు ఠాక్రే అన్న పేరు మరోసారి ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే చిన్న కుమారుడు తేజస్. పందొమ్మిదేళ్ల తేజస్ తన తాత వల్ల బాగా పాపులర్ అయిన తమ వంశనామం ఠాక్రే అన్న పేరును ఓ పీతజాతికి పెట్టాడు. దానిపై ఆయన రాసిన వ్యాసాలు అంతర్జాతీయ జర్నళ్లకు పంపించడంతో ఇప్పుడు ఠాక్రే పేరు మరోసారి పాపులర్ అయింది.
తేజస్ కు వైల్డ్ లైఫ్ అంటే బాగా ఇష్టమట. అక్కడ ఉండే జీవజాలం పై ఆయన సునిశితంగా అధ్యయనం చేస్తుంటాడు. గత ఏడాది ఆయన కొందరు స్నేహితులతో కలిసి కొంకణ్ ప్రాంతానికి వెళ్లి అక్కడి రఘువీర్ ఘాట్స్ లో తిరిగాడు. అక్కడ అయిదు కొత్త జాతికి చెందిన మంచినీటి పీతలను ఆయన గుర్తించాడట. వాటికి ఠాక్రే పేరు పెట్టాడు తేజస్. ''గుబెర్ నాటోరియానీ ఠాకరాయి'' అని వాటికి పేరు పెట్టి... వాటిపై పరిశోధన పత్రం రాశాడు. జుటాక్స్ అనే ఇంటర్నేషనల్ జర్నల్ లో అది పబ్లిష్ కావడంతో ప్రపంచవ్యాప్తంగా ఠాక్రే పేరు మరోసారి పాపులరైంది.