Begin typing your search above and press return to search.

యువకుడిపై యువతి యాసిడ్ దాడి...వారంలో రెండోసారి , ఏంచేసాడంటే ?

By:  Tupaki Desk   |   4 Sep 2020 1:15 PM GMT
యువకుడిపై యువతి యాసిడ్ దాడి...వారంలో రెండోసారి , ఏంచేసాడంటే ?
X
రోజులు మారిపోయాయి...ఎప్పుడూ ఒకే కాలం ఉంటుంది అనుకోవడం పొరపాటే. రోజులు గడుస్తున్నా .. పరిజ్ఞానం పెరుగుతున్నా .. ఎన్నో కొత్త చట్టాలు రూపుదిద్దుకుంటున్నా మహిళలపై వేధింపులు, మోసాలు జరుగుతున్నాయి. అయితే , అందరిలా తనకి జరిగింది అని కుమిలి పోకుండా ఓ యువతి తిరగబడింది. తనను మోసం చేసిన యువకుడిపై యాసిడ్ దాడికి దిగింది. వారంలో రెండోసారి యాసిడ్ దాడికి పాల్పడింది. తనని ప్రేమించి , మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్న యువకుడిపై ఓ యువతి యాసిడ్ దాడి కి పాల్పడింది.

ఆంధ్రప్రదేశ్‌ లోని కర్నూలు జిల్లాలో ఈ ఘటన జరిగింది. వారం రోజుల్లో యువకుడిపై ప్రియురాలు యాసిడ్ దాడి చేయడం ఇది రెండోసారి కావడం గమనార్హం. నంద్యాల మండలం పెద్దకొట్టాలకు చెందిన యువతిని నాగేంద్ర అనే యువకుడు ప్రేమ పేరుతో వెంటపట్టాడు. చివరికి వన్ సైడ్ లడ్ టూ సైడ్ లవ్ గా మారింది. తనను పెళ్లి చేసుకోవాలని గత కొంతకాలం నుంచి నాగేంద్రను ఆ యువతి అడుగుతోంది. ప్రేమించిన యువతిని పెళ్లి చేసుకోకుండా నాగేంద్రం మోసం చేశాడు. తను ప్రేమించి మోసం చేయడంతో పాటు, మరో యువతిని నాగేంద్ర పెళ్లి చేసుకున్నాడని తెలుసుకుంది. వారం రోజుల కిందట నాగేంద్రపై యాసిడి దాడి చేసిన బాధితురాలు, తాజాగా మరోసారి తనను మోసం చేసిన ప్రియుడిపై యాసిడి దాడికి పాల్పడినట్లు సమాచారం. బాధితుడ్ని కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. దాడిలో అతడికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు..యువతిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు.