Begin typing your search above and press return to search.
ఎల్బీ నగర్ ప్రేమోన్మాది దాడి .. 14 రోజుల రిమాండ్!
By: Tupaki Desk | 11 Nov 2021 9:34 AM GMTఎల్బీ నగర్ లో నిన్న ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేసిన ఘటన గురించి తెలిసిందే. అయితే, ఈ ప్రేమోన్మాది దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఎల్బీ నగర్ లోని నవీన హాస్పిటల్ లో యువతికి చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం బాధిత యువతి కండిషన్ ఇంకా క్రిటికల్ గానే ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. తనతో పెళ్లి నిరాకరించిందని కక్షతో 18 కత్తి పోట్లు పొడిచాడు ఆ ఉన్మాది. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్ కు చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు.
గత కొంతకాలంగా ఎల్బీనగర్ లోని హస్తినాపురంలో తన పిన్ని తో కలిసి ఉంటున్న యువతి… గతంలో బాధిత యువతి మధ్య నిందితుడు బస్వరాజు ప్రేమాయణం చోటు చేసుకుంది. అయితే… బస్వరాజు తో పెళ్లికి నిరాకరించారు శిరీష తల్లిదండ్రులు. ఈ నేపథ్యంలోనే… శ్రీధర్ అనే వ్యక్తి తో ఇటీవల శిరీషకు ఎగేంజ్ మెంట్ చేశారు ఆమె తల్లిదండ్రులు. విషయం తెలుసుకున్న బస్వరాజు శిరీష పై అక్కసు తో దాడికి పాల్పడ్డట్లు పోలీసులు గుర్తించారు. దాడి లో తీవ్రంగా గాయపడింది శిరీష.
ఈ కేసులో నిందితుడి నిందితుడు బస్వరాజ్ కి రిమాండ్ విధించింది కోర్టు. యువతి దాడి కేసులో భాగంగా ఇవాళ నిందితుడు బస్వరాజ్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు లో హాజరుపర్చారు పోలీసులు. ఈ సందర్భంగా పోలీసులు చెప్పిన వివరాలు విన్న…రంగారెడ్డి జిల్లా కోర్టు…నిందితుడు బస్వరాజ్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. యువతి తల్లిదండ్రులు, సోదరుడు యువతి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి చేరుకున్నారు. వైద్యులను అడిగి.. తమ కుమారై ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం యువతి తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడారు. యువతి పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్లు చెప్పారు. యువతి శరీరంపై 18 చోట్ల గాయాలున్నాయని.. 24గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని డాక్టర్లు చెప్పినట్లు తెలిపారు.