Begin typing your search above and press return to search.

రూ.51 లక్షలు ఇవ్వు .. లేదంటే నీ నగ్న వీడియో ... యువతి బ్లాక్‌మెయిల్

By:  Tupaki Desk   |   13 March 2021 4:30 PM GMT
రూ.51 లక్షలు ఇవ్వు .. లేదంటే నీ నగ్న వీడియో ... యువతి బ్లాక్‌మెయిల్
X
పేస్ బుక్ ప్రేమ మరో యువకుడి కొంప ముంచింది. మంచి ఉద్యోగం , మంచి జీవితం .. హాయిగా సాగిపోతున్న అతని జీవితంలోకి ఏంజల్ లా వచ్చి మైమరపించి , భలే ఉన్నావు , నిన్ను అలా చూడాలని ఉంది అంటూ మాటలతో మత్తెక్కించి , మత్తులోకి దించి నగ్న వీడియోలు సేకరించింది. ఆ తర్వాత ఆ యువతి అసలు బండారం బయటపెట్టేసరికి ఆ యువకుడు లబోదిబోమంటున్నాడు. నగ్న వీడియో తో బ్లాక్ మెయిల్ కి దిగిన ఆ యువతి ఏకంగా రూ. 51 లక్షలు డిమాండ్ చేయడంతో దిక్కుతోచని స్థితిలో పోలిసుల సాయం ఆ యువకుడు కోరడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళ్తే .. ఢిల్లీలోని నలసోపారా ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల యువకుడు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. అతన్ని టార్గెట్ చేసిన ఓ యువతి డబ్బులు కాజేసేందుకు ఫ్లాన్ చేసింది. ఓ రోజు రాత్రి 9 గంటలకు అతని మొబైల్‌కు మెసేజ్ పంపింది. అది తెరిచి చూస్తే ఫేస్‌ బుక్‌ లో రిక్వెస్ట్. ఎవరో అందమైన అమ్మాయి ఆ రిక్వెస్ట్ పంపింది. వెంటనే ఓకే చేసేశాడు. ఆ తర్వాత అతనితో చాటింగ్ మొదలుపెట్టింది. పరిచయాలు, పలకరింపులూ మొదలయ్యాయి. కొన్ని రోజుల్లోనే బాగా దగ్గరైపోయింది. వాట్సాప్ నంబర్ అడిగింది. ముందూ వెనకా ఆలోచించకుండా వెంటనే ఇచ్చేశాడు. ఆ తర్వాత వాట్సాప్ చాటింగ్ మొదలైంది. మెల్లగా వీడియో చాట్ మొదలుపెట్టింది. ఫొటోల్లో కంటే, వీడియోలో ఇంకా అందంగా ఉండటం తో నా పంట పండింది అని అనుకున్నాడు.ఓ రోజు రాత్రి వేళ వాట్సాప్ వీడియో కాల్ చేసింది. నిద్రపోవడం మానేసి ఆమెతో ముచ్చట్లు మొదలుపెట్టాడు. నువ్వు నాకు బాగా నచ్చావ్.... అంది. నవ్వాడు. నీ బాడీ చూడాలని చెప్పడంతో ఆశ్చర్యపోయాడు. ప్లీజ్చూపంచవా అనేసరికి తెగ మెలికలు తిరిగేశాడు. పై బాడీ చూపించాడు. మిగతావి కూడా విప్పి చూపించు అంటే కొంచెం మొహమాట పడ్డాడు. నేనూ చూపిస్తా , ముందు నువ్వు చూపించు అంది. సరే అని బట్టలన్నీ విప్పేసి నగ్నంగా కనిపించాడు. అన్నీ ఆమె చెప్పినట్లు చేశాడు. ఆ తర్వాత నువ్వు కూడా విప్పు అంటే ఛీ నాటీ అంటూ పెట్టేసింది.

ఆ తర్వాత రెండ్రోజులకి అతని వాట్సాప్ నంబర్‌ కి అతని నగ్న వీడియోని పంపింది. తనకు రూ.51,00,000 పంపాలని డిమాండ్ చేసింది. లేదంటే, ఆ వీడియోని అతని ఫ్రెండ్స్, పేరెంట్స్, బంధువులు, ఆఫీసులో ఉద్యోగులు అందరికీ పంపిస్తానని బ్లాక్ ‌మెయిల్ చేసింది. దీనితో ఈ ఊహించని షాక్ కి షాకై , వెంటనే తులింజ్ పోలీసులని కలిసి కంప్లైంట్ ఇచ్చాడు. మార్చి 6, మార్చి 8న తనకు బెదిరింపు కాల్స్ వచ్చినట్లు చెప్పాడు. ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు. సైబర్ సెల్ టీమ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ప్రస్తుతం ఆ యువతి మొబైల్ నంబర్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ప్రస్తుతం ఆ యువతిని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమై ఉన్నారు. అలాగే ఎవరు పడితే వాళ్లు మాట్లాడితే ఆ మైకం ఏది పడితే అది చేయకుండా కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు.