Begin typing your search above and press return to search.
యువతి అదృశ్యం కలకలం: రంగంలోకి సీఎం, స్టార్ హీరో
By: Tupaki Desk | 19 Sep 2021 4:29 AM GMTజాతీయ స్థాయిలో వైద్యవిద్యార్థులకు ఒకే ఎంబీబీఎస్ ప్రవేశాలకు పరీక్ష 'నీట్'ను నిర్వహిస్తున్నారు. ఇది ఉత్తరాధి, హిందీ వారికే మేలు చేస్తుందని.. దక్షిణాది విద్యార్థులకు అన్యాయం ఇప్పటికే తమిళనాడు నేతలు, హీరోలు ఆరోపించారు. నీట్ వల్ల తమిళ విద్యార్థులు నష్టపోయారని అక్కడ పెద్ద ఉద్యమమే నడుస్తోంది.
ఇప్పటికే తమిళనాట ముగ్గురు విద్యార్థులు నీట్ ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. నీట్ భయం ఇంకా ఇప్పటికీ విద్యార్థులను వెంటాడుతూనే ఉంది. నీట్ ను మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినా కూడా విద్యార్థులు ఊరట చెందడం లేదు.
తాజాగా ఓ విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నీట్ పరీక్ష రాసి వచ్చిన అనంతరం కీ పేపర్ చూసుకున్న విద్యార్థిని కనిపించకుండా పోయింది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
తమిళనాడులోని నమక్కర్ జిల్లా రాసిపురం పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన శ్వేత(19) జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్-నీట్)ను ఈనెల 12వ తేదీన రాసింది. ఈనెల 17వ తేదీన రాసిన పరీక్షలకు సంబంధించిన కీ పేపర్ చూసుకుంది. ఉత్తర్తీత సాధించలేనని గ్రహించి ఇంట్లో నుంచి కనిపించకుండా వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు, పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
నీట్ పరీక్ష.. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే నీట్ కు మినహాయింపు ఇస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. అయినా విద్యార్థుల బలవన్మరణాలు ఆగకపోవడంతో సీఎం స్టాలిన్ స్వయంగా వీడియో సందేశం విడుదల చేశారు.'పరీక్షపై ఆందోళనతో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దు.. బంగారు భవిష్యత్ ఎంతో ఉంది' అని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే సినీ నటుడు సూర్య కూడా విద్యార్థులకు ఆందోళన చెందవద్దని ఓ పిలుపునిచ్చాడు.