Begin typing your search above and press return to search.
రోడ్డు లేక మాకు పెళ్లిళ్లు కావడం లేదు.. సీఎంకి యువతి లేఖ , ఆ తర్వాత ఏమైందంటే
By: Tupaki Desk | 18 Sep 2021 5:30 AM GMTమా గ్రామంలో రోడ్లు బాగోలేక స్థానికులకు వివాహాలు జరుగడం లేదంటూ ఒక యువతి సీఎం కార్యాలయానికి లేఖ రాసింది. ఇది అధికారుల్లో కదలిక తెచ్చింది. కర్ణాటకలోని దవంగెరె జిల్లాలోని హెచ్ రాంపురా గ్రామంలో రోడ్లు దారుణంగా ఉన్నాయి. దీంతో గ్రామానికి చెందిన 26 ఏండ్ల ఉపాధ్యాయురాలు బిందు దీనిపై ఆ రాష్ట్ర సీఎం కార్యాలయానికి ఒక లేఖ రాశారు. ‘మా గ్రామానికి సరైన రోడ్ కనెక్టివిటీ లేదు. ఈ గ్రామం ఇంకా వెనుకబడి ఉంది. దీని వల్ల మాలో చాలా మందికి వివాహాలు కావడం లేదు. ఎందుకంటే, గ్రామంలో సరైన రోడ్లు లేకపోవడం వల్ల పిల్లలు ఇక్కడ విద్యను పొందలేరని బయటి వ్యక్తులు భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో రోడ్డు పనులు చేపట్టండి అని అందులో పేర్కొన్నారు.
కర్ణాటకకు చెందిన 26 ఏళ్ల బింధు అనే యువతి దావణ్‌గెరె జిల్లాలోని హెచ్ రాంపురాలో టీచర్‌గా పనిచేస్తోంది. తమ గ్రామంలో రోడ్లు బాగోలేక పోవడం వల్ల గ్రామంలోని యువతకు పెళ్లిళ్లు కావడం లేదని ఆరోపించింది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మెకు లేఖ రాసింది. ఇందులో గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించింది. రోడ్లు బాగోలేవని, వీలైనంత తొందరగా వాటిని పునురద్దరించాలని కోరింది. అలాగే రోడ్ల మరమ్మత్తులు చేపట్టేవరకు వివాహం చేసుకోనని స్పష్టం చేసింది.
మా గ్రామానికి మంచి రోడ్డు కనెక్టివిటీ లేదు. గ్రామం ఎంతో వెనుకబడి ఉంది. మాలో చాలా మందికి వివాహ సంబంధాలు అందడం లేదు. ఎందుకంటే ఇక్కడి పిల్లలు విద్యను అభ్యసించలేకపోతున్నారు. రోడ్డు బాగాలేని కారణంగా బయటి గ్రామాల వాళ్లు హెచ్ రాంపూర్‌లోని వారితో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడడం లేదు. మా ఊరికి బస్సు లేదు. అంతేకాదు గతుకులు, మట్టిరోడ్డు.. ఈ రోడ్డులో ప్రయాణిస్తే వెన్నుముక విరిగిపోవడం ఖాయం.హెడ్నే గ్రామం నుండి మా ఊరికి వెళ్లే రెండు కిలోమీటర్ల మేర మట్టి రోడ్డు సంవత్సరాలుగా రిపేర్లు లేక అలాగే ఉంది’ బిందు పేర్కొన్నారు.
కాగా బిందు లేఖకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. అంతేగాక గ్రామీణాభివృద్ధి,పంచాయితీరాజ్ శాఖను తక్షణమే పనులు చేపట్టాలని.. జరుగుతున్న పనుల గురించి వారికి తెలియజేయాలని సీఎంఓ ఆదేశించింది. దీని మీద బిందు మాట్లాడుతూ ‘ఈ రోడ్డును బాగు చేయడానికి మా ప్రజాప్రతినిధులకు కనీసం ఆరు నెలలు పడుతుందని చెప్పారు. అందుకే అప్పటి వరకు పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని తెలిపింది. మరోవైపు ఈ గ్రామంలోని రోడ్డు అభివృద్ధి కోసం ఇప్పటికే సుమారు రెండు లక్షల వరకు ఖర్చు చేసినట్లు మాయకొండ పంచాయతీ అభివృద్ధి అధికారి ఎం సిద్దప్ప తెలిపారు. అయితే ఈ నిధులు సరిపోవని తారు రోడ్డు వేసేందుకు రూ.50 లక్షల నుంచి కోటి వరకు వ్యయం అవుతుందని అన్నారు. ఈ మేరకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేను కోరినట్లు చెప్పారు.