Begin typing your search above and press return to search.
మహిళను వేధిస్తున్న టీడీపీ కార్యకర్త.. మంత్రి ఆగ్రహం
By: Tupaki Desk | 9 Jan 2021 10:30 AM GMTటీడీపీ కార్యకర్త వేధిస్తున్నాడని ఓ యువతి బోరుమంది. తాజాగా ఏపీ మంత్రి శంకరనారాయణ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి బాధిత యువతికి ధైర్యం చెప్పారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు, లైంగిక వేధింపులకు పాల్పడడం టీడీపీ వర్గీయులకు మామూలేనని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ఆరోపించారు. టీడీపీ కార్యకర్త పద్మాచారి వేధింపులకు గురి చేస్తున్నాడని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
2015లో తహసీల్దార్ వనజాక్షిని టీడీపీ నేతలు ఇబ్బందులు పెట్టిన విషయం అందరికీ తెలుసని మంత్రి శంకరనారాయణ అన్నారు.. ఆ పార్టీ నేతలు మహిళలపై దౌర్జన్యాలకు పాల్పడితే వాటిని కప్పి పుచ్చుకునేందుకు వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేయడం ఏంటని ప్రశ్నించారు.
యువతి పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి నారాలోకేష్ అవగాహనరాహిత్యంతో ట్వీట్ లు, ఫేక్ వీడియోలు పెడుతున్నాడని.. ప్రేమోన్మాదులకు మద్దతు పలకడం ఆయనకే చెల్లిందని మంత్రి శంకర్ నారాయణ ఆరోపించారు. 2018లోనే యువతి ఫిర్యాదు చేస్తే నాటి మాజీ టీడీపీ ఎమ్మెల్యే పార్థసారథి అండతో పద్మాచారి తప్పించుకున్నాడని ఆరోపించాడు. అప్పుడే కఠిన చర్యలు తీసుకొని ఉంటే మూడేళ్లుగా ఆ కుటుంబం మానసిక క్షోభకు గురయ్యేది కాదన్నారు.
ప్రస్తుతం పోలీసులు యువతి కుటుంబానికి న్యాయం చేయాలని చూస్తుంటే మరో టీడీపీ కార్యకర్త చారి బ్లాక్ మెయిల్ చేయడానికి ఆత్మహత్యాయత్నం డ్రామా చేస్తే బీకే పార్థసారథి అలాంటి వారిని పరామర్శించడం ఏమిటని నిలదీశారు. నిలదీసిన మహిళలపై టీడీపీ నాయకులు అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యం చేయడం ఆ పార్టీ తీరుకు నిదర్శనమన్నారు.
ఈ సందర్భంగా మూడేళ్లుగా టీడీపీ కార్యకర్త పద్మాచారి వేధింపులతో నరకం అనుభవిస్తున్నానని గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కేసుపెట్టినా పలుకుబడితో ఒక్కరోజులోనే బయటకు వచ్చి లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధిత యువతి మంత్రి శంకర్ నారాయణకు, మీడియా ఎదుట వాపోయింది. ఈ సందర్భంగా న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.