Begin typing your search above and press return to search.

అన్నకు బదులు తాళి కట్టిన తమ్ముడి కథ

By:  Tupaki Desk   |   5 Jun 2017 7:58 AM GMT
అన్నకు బదులు తాళి కట్టిన తమ్ముడి కథ
X
సినిమా కథలు కూడా ఎందుకూ పనికిరాని రీతిలో అన్నకు బదులు తాళి కట్టిన తమ్ముడి వ్యవహారం మరో మలుపు తిరిగింది. తాళి కట్టిన తరువాత జరిగిన పరిణామాలతో అడ్డం తిరిగిన ఆ తమ్ముడిని వధువు బంధువులు కిడ్నాప్ చేశారు. బలవంతంగా కట్టిన ఆ తాళిని వధువు బంధువలు అంతే బలవంతంగా తీయించడంతో ఆగ్రహించిన ఈ ఆకస్మిక పెళ్లి కొడుకు ఇప్పుడు ఆమెను ఏలుకోబోనని మొండికేయడంతో వధువు బంధువులు ఆయన్ను ఎత్తుకెళ్లారు.

తమిళనాడులోని వేలూరు జిల్లా సెలరైపట్టిలో జరిగిన ఈ ఉదంతం దేశవ్యాప్తంగా ఆసక్తి రేపింది. సెలరైపట్టికి చెందిన కామరాజ్ కు ముగ్గురు కుమారులు. అందులో రాజేశ్ పెద్దవాడు కాగా.. వినోద్ అందరికంటే చిన్నవాడు. రాజేశ్ కు విరుదునగర్ కు చెందిన కాళేశ్వరి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేశారు. ఆర్నెళ్ల తరువాత వివాహ ముహూర్తం. మొన్న 1వ తేదీన వీరిద్దరి పెళ్లి జరగాల్సి ఉంది. అందుకు ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి. వధూవరులిద్దరూ పెళ్లి పీటలపై ఉన్న సమయంలో తాళికట్టే ముహూర్తం రాగానే పెళ్లికొడుకు చిన్న తమ్ముడు వినోద్ హఠాత్తుగా ఎంటరై అన్న రాజేశ్ ను పక్కకు నెట్టి కాళేశ్వరి మెడలో తాను తాళి కట్టేశాడు. ఇదంతా తెలిసిన కథే...

ఆ తరువాత జరిగిన పరిణామంతో ఏం చేయాలో తెలియని పెద్దలు అంతా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. వినోద్ కట్టిన తాళిని కాలేశ్వరితో తీయించేశారు. కానీ... కాలేశ్వరి మాత్రం తనకు తాళి కట్టిన వినోదే తన భర్తని, ఆయనతోనే కాపురం చేస్తానని చెప్పింది. దీంతో పెద్దలంతా మళ్లీ వినోద్ ను కలిశారు. ఆయన మాత్రం తాను కట్టిన తాళి తీసేసిన కాళేశ్వరితో కాపురం చేయబోనన్నాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో వినోద్ ను వధువు బంధువులు ఎత్తుకెళ్లారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/