Begin typing your search above and press return to search.

బంపరాఫర్: ఇంట్లో ఉంటే కోడి+గుడ్లు ఫ్రీ

By:  Tupaki Desk   |   26 April 2020 9:45 AM GMT
బంపరాఫర్: ఇంట్లో ఉంటే కోడి+గుడ్లు ఫ్రీ
X
కరోనా ప్రబలింది.. లాక్ డౌన్ పొడిగించేశారు. ఇంకా ఎన్నిరోజులు ఉంటుందో తెలియదు. ఇలాంటి కష్ట కాలంలో పేదలు - కూలీలు అన్నార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. ఎంతో మంది సహృదయం కలిగిన వారు వారికి నిత్యావసరాలు - కూరగాయలు - అన్నదానం చేస్తూ ఉదారత చాటుకుంటున్నారు. నిరుపేదలకు ఆపన్నహస్తం అందిస్తున్నారు.

అయితే వాటికి మించి ఓ యువకుడు తన గ్రామానికి సాయం చేయాలని ముందడుగు వేశాడు. అతడి ఉదారతకు గ్రామస్థులంతా ఫిదా అయ్యారు.

సంగారెడ్డి జిల్లా గుంతపల్లి గ్రామానికి చెందిన అనంతరెడ్డి అనే యువకుడు తన ఊరి గ్రామస్థుల కోసం మహా సాయానికి పాల్పడ్డాడు. లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లో ఉండే వారికి బంపరాఫర్ ఇచ్చాడు. గుంతపల్లి గ్రామం వికారాబాద్ జిల్లా సరిహద్దున ఉంటుంది. అక్కడ కరోనా కేసులు ప్రబలుతున్న దృష్ట్యా అందరూ ఇళ్లలోనే ఉండాలని అనంతరెడ్డి గ్రామస్థులకు అవగాహన కల్పించారు. అంతేకాదు.. అలా ఇంట్లోనే ఉంటూ స్ఫూర్తిగా నిలుస్తున్న గ్రామంలోని పలు కుటుంబాలకు ఏకంగా ఉచితంగా ఒక కోడి, కోడిగుడ్లను పంపిణీ చేశారు.

ఇప్పటికే ఇతడు ఈ గ్రామంలో రెండుసార్లు కూరగాయలు, సరుకులు పంపిణీ చేశారు. లాక్ డౌన్ వేళ ఊరికి ఉపకారం చేయాలని ఇలా చేస్తున్నట్టు తెలిపాడు. గ్రామంలోని సుమారు 450 కుటుంబాలకు కోడి - కోడిగుడ్లను పంపిణీ చేశాడు. అతడి సాయానికి గ్రామస్థులంతా కృతజ్ఞతలు తెలిపారు.