Begin typing your search above and press return to search.
మీ దేవుడు ఎన్టీఆర్ పేరు తీసేశారు కొడాలి నాని.. ఇప్పుడేమంటావ్?
By: Tupaki Desk | 21 Sep 2022 10:30 AM GMTఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు కొన్ని విచిత్రంగా ఉంటాయి. ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో? అస్సలు ఊహించలేని రీతిలో నిర్ణయాలు తీసుకునే అలవాటు ఉన్న జగన్.. తనకున్న పేరు ప్రఖ్యాతులకు తగ్గట్లే తాజాగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
జగన్ తీసుకున్న నిర్ణయం.. ఆయన పార్టీకి చెందిన కొందరు నేతలకు విషమ పరీక్షలా మారుతుందని చెప్పక తప్పదు. ఒకప్పుడు తెలుగుదేశం లో ఉండి.. ఎన్టీఆర్ చలువతో రాజకీయంగా ఎదిగినోళ్లు చాలామందే ఉన్నారు.
ఎన్టీఆర్ పెట్టిన పార్టీ అన్న అభిమానంతో పార్టీలో చేరిన వారు కొందరు ఉండి.. కాలక్రమంలో వైసీపీలో చేరినోళ్లు ఉన్నారు. ప్రస్తుతం మంత్రిగా వ్యవహరిస్తున్న ఆర్కే రోజా.. తరచూ స్వర్గీయ నందమూరి తారకరామారావు మీద తనకున్న కమిట్ మెంట్ ను..
తనకున్న ప్రేమాభిమానాల్నిప్రదర్శిస్తుంటారు. మాజీ మంత్రి కొడాలి నాని సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్వర్గీయ ఎన్టీఆర్ ను తనకు దేవుడన్న రీతిలో ఆయన మాటలు ఉంటాయి. అదే సమయంలో సీఎం జగన్ ను సైతం తన ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు.
తన దైవాన్ని.. తన ఆరాధ్య దైవం ఇంతకాలం ఎలాంటి డ్యామేజ్ చేయకపోగా.. ఆయన పేరుతో జిల్లాను ఏర్పాటు చేసిన నేపథ్యంలో.. తన మాజీ బాస్ పై నిప్పులు చెరిగి.. అనరాని మాటల్ని అనేయటం చూశాం. చంద్రబాబును తిడుతూ.. స్వర్గీయ ఎన్టీఆర్ ను పొగిడేస్తూ మాట్లాడిన కొడాలి నాని..
ఇప్పుడు ఏం చేస్తారు? ఎలా రియాక్టు అవుతారు. అన్నది అసలు ప్రశ్న. తన దైవాన్ని..తన ఆరాధ్య దైవం ఇబ్బంది పెట్టేలా తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందించే తీరు ఎలా ఉంటుందన్నది అసలు ప్రశ్న. తాజా ఎపిసోడ్ లోనూ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి రామారావు పేరు తీసేసి వైఎస్సార్ పేరు పెట్టటాన్ని సమర్థిస్తారా? లేదంటే అందుకు భిన్నంగా రియాక్టు అవుతారా? అన్నదిప్పుు ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.