Begin typing your search above and press return to search.
మీ మాటలేమో ధీమా ఇస్తాయి.. వాస్తవం మాత్రం మహా చేదుగా ఉంది ఈటెల
By: Tupaki Desk | 19 April 2021 7:30 AM GMTచూస్తుండగానే కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగిపోయింది. మొన్నటివరకు వెయ్యి.. రెండు వేల మధ్యలో ఉన్న కేసులు.. ఇప్పుడు ఏకంగా ఐదు వేలకు పైనే నమోదువుతున్నాయి. అది కూడా ఆచితూచి అన్నట్లు వేసిన లెక్కలతోనే. మొదటి వేవ్ తో పోలిస్తే.. సెకండ్ వేవ్ తెలంగాణలో తీవ్రంగా ఉంది. వాస్తవ లెక్కల్ని తెర మీదకు వస్తే..రోజుకు పదివేలకు పైనే కొత్త కేసులు వెల్లడవుతున్నట్లుగా చెబుతున్నారు. ఇంత భారీగా కేసులు పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా.. ఆసుపత్రుల్లో బెడ్లు మొదలు.. టెస్టులకు పెద్ద ఎత్తున పోటీనెలకొంది. వ్యాక్సిన్లతో పాటు.. కీలక మెడిసిన్ల కొరత వెంటాడుతున్నట్లుగా పలువురు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే తెలంగాణరాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ మాత్రం భరోసా మాటలు చాలానే చెబుతున్నారు. తెలంగాణలో కార్పొరేట్ ఆసుపత్రుల్ని మినహాయిస్తే.. రాష్ట్రంలో ఎక్కడా కొవిడ్ బాధితులకు బెడ్ల కొరత లేదని ఆయన చెబుతున్నారు. ప్రభుత్వం.. ప్రైవేటు ఆసుపత్రుల్లో కలిపి 63 వేల పడకలు అందుబాటులో ఉన్నాయని.. బెడ్లు దొరకవని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన చెబుతున్నారు.
ఈటెల మాటలు వింటే.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎంత భారీగా ఏర్పాట్లు చేశారు. మరెంతలా వసతులు కల్పించారన్న అభిప్రాయం కలుగక మానదు. మరి.. వాస్తవం ఎలా ఉంది? ఎవరైనా సామాన్యుడికి కరోనా పాజిటివ్ అని తేలి.. అతని ఆరోగ్య పరిస్థితి బాగోకపోతే.. వైద్యం కోసం వెళితే.. ఎవరూ బెడ్డు ఇవ్వని పరిస్థితి నెలకొన్నట్లు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలు.. అక్కడి ఆసుపత్రుల్ని కాసేపుపక్కన పెట్టేద్దాం.
హైదరాబాద్ మహానగరానికి వద్దాం. ఇక్కడ పేరున్న ఆసుపత్రులకు కొదవ లేదు. కానీ.. ఎక్కడా బెడ్లు దొరకని పరిస్థితి. మంత్రిగారి మాటలు మహా తియ్యగా.. ధీమాను తెచ్చేలా ఉంటున్నాయి. వాస్తవం మాత్రం అందుకు భిన్నంగా.. మహా చేదుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏ ఆసుపత్రికి వెళ్లినా.. కరోనా అంటే చాలు.. బెడ్లు లేవని చెప్పేస్తున్నారు. దీంతో.. బెడ్ల కోసం భారీ ఎత్తున పైరవీలు చేయాల్సిన దుస్థితి. ఈటెల మాటల్లో వినిపిస్తున్న ధీమా.. వాస్తవంలో లేదని.. సామాన్యుడి మాదిరి వెళ్లి చూస్తే.. పరిస్థితి అర్థమవుతుందంటున్నారు. మరి.. ఆ సంగతేదో చూడకూడదు ఈటెల సాబ్?