Begin typing your search above and press return to search.
ఫేస్ బుక్ ప్రేమ.. ముగ్గురి బలి..
By: Tupaki Desk | 3 Aug 2018 10:35 AM GMTసోషల్ మీడియా. బంధాలను ఎంతగా కలుపుతుందో.. అంతే స్థాయిలో బలితీసుకుంటుంది కూడా. తాజాగా జరిగిన ఓ సంఘటన ఓ పచ్చని సంసారాన్ని చిదిమేసింది. మొత్తం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. ఫేస్ బుక్ లో మొదలైన ప్రేమ చివరకు ఓ భార్యభర్తను.. ఈ వ్యవహారంలో బాధ్యుడైన యువకుడి ప్రాణాలను తీసేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడేనికి చెందిన మురళికి రాజమండ్రికి చెందిన బిందుతో కొన్నాళ్ల క్రితం ఫేస్ బుక్ లో పరిచయం అయ్యింది. బిందుకు అప్పటికే పెళ్లి అయ్యి భర్త ఉన్నాడు. బిందు లక్కవరంలోని అమ్మమ్మ ఇంటికి వచ్చిన క్రమంలో మురళికి - బిందుకు సాన్నిహిత్యం పెరిగింది.
వీరి వ్యవహారం ఇలా కొంతకాలం పాటు కొనసాగాక.. మురళి ఏకంగా బిందు భర్తకు ఫోన్ చేసి ‘తాను-బిందు ప్రేమించుకుంటున్నామని.. ఆమెను తనకు వదిలేయాలని’ కోరాడు. మురళి మాటలకు మనస్తాపం చెందిన బిందు భర్త సాయి గత నెలలో ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త మరణాన్ని తట్టుకోలేక బిందు గోదావరి దూకి ఆత్మహత్య చేసుకుంది.
భార్యభర్తల మరణాలపై వారి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు మురళిని అదుపులోకి తీసుకొని విచారించారు. దీన్ని అవమానంగా భావించిన మురళీ ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇలా ఫేస్ బుక్ ప్రేమ చివరకు ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది.