Begin typing your search above and press return to search.
గతంలో దాడి చేశారంటూ గులాబీ ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో యూత్ కాంగ్రెస్ దాడి
By: Tupaki Desk | 3 Feb 2022 10:36 AM GMTగడిచిన కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా నడుస్తున్న వ్యవహారం హాట్ హాట్ గా మారుతోంది. పలు సందర్భాల్లో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తోంది. కారు బ్యాచ్ కు.. కమలదళానికి నడుము జరుగుతున్న రాజకీయ రచ్చతో కాంగ్రెస్ ఊసే లేకుండా పోతున్న పరిస్థితి. తమను తొక్కేయటానికే కారు.. కమలం బ్యాచులో ఉమ్మడిగా ప్లాన్ చేసి దెబ్బస్తున్నారంటూ మండిపడుతున్న వైనం ఈ మధ్యన చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో కారు - కమలం మధ్య ఫైట్ ను బ్రేక్ చేసి.. పొలిటికల్ సీన్ ను తమ వైపునకు తిప్పుకోవాలన్న కసితో కాంగ్రెస్ ఉంది.
తాజాగా జరిగిన ఉదంతం చూస్తే.. తెలంగాణ అధికారపక్షం ఫోకస్ మొత్తం తమ వైపునకు మారాలన్నట్లుగా తెలంగాణ యూత్ కాంగ్రెస్ తీరు ఉందని చెప్పాలి. నిరుద్యోగుల విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ మధ్యన నిరసన తెలిపే క్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును యూత్ కాంగ్రెస్ ముట్టడించే ప్రయత్నం చేసింది. శాంతియుతంగా చేపట్టిన నిరసనపై గులాబీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అనుచరులు పలువురు వీధి రౌడీల్లా వ్యవహరిస్తూ తమపై దాడికి పాల్పడినట్లుగా రంగారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రవికాంత్ గౌడ్ ఆరోపించటం తెలిసిందే.
దీనిపై ఇప్పటికే పలుమార్లు పోలీసులను కలిసి.. చర్యలు తీసుకోవాలని కోరినా.. ఎలాంటి స్పందన లేదని వారు మండిపడుతున్నారు. తామేం చెప్పినా వినని నేపథ్యంలో.. అంతకంతకూ బదులు తీర్చుకోవాలన్నట్లుగా తాజాగా వారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కారుపై కోడిగుడ్లతో దాడి చేసిన వైనం సంచలనంగా మారింది. దాడికి ప్రతిదాడి సమాధానం ఎంతమాత్రం కాదు. అధికార పక్షం నేతలు తప్పు చేశారని.. ఆ వంకతో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ దాడి చేయటం సరికాదు. కానీ.. యూత్ కాంగ్రెస్ నేతలు మాత్రం.. తమపై జరిగిన దాడిపై న్యాయం చేయాలని పోలీసుల్ని కోరితే ఏమాత్రం పట్టించుకోవటం లేదని.. అందుకే వారికి తెలిసిన తీరులో తాము వ్యవహరించినట్లుగా మండిపడుతున్నారు.
ప్రజా సమస్యలపై పోరాడే వారిపై టీఆర్ఎస్ నేతలు.. వారి అనుచరులు దాడి చేస్తే ఊరుకుండేది లేదని యూత్ కాంగ్రెస్ స్పష్టం చేస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడే ప్రతిపక్షాలపై అధికారంలో ఉన్నామని దాడికి పాల్పడితే.. స్పందన ఇలానే ఉంటుందని చెబుతున్నారు. టీఆర్ఎస్ నేతల నిరంకుశ తీరుపై పోరాటానికి ఇది ఆరంభంగా వారు పేర్కొన్నారు. తాజా ఉదంతాన్ని చూస్తే.. తెలంగాణలో సరికొత్త రాజకీయ రగడకు తెర లేచినట్లుగా చెప్పక తప్పదు.