Begin typing your search above and press return to search.
కోస్తాలో కుల సమరం - 3
By: Tupaki Desk | 9 Sep 2015 10:46 AM GMTపురంధేశ్వరి ఘటన జరిగిన ఏడాది తర్వాత.. మళ్లీ సదరు కుల విద్యార్థి నాయకుల సమూహం మరోమారు ఆమెను అతిధిగా పిలవటానికి మహా హుషారుగా వెళ్లారు. గత ఏడాది కంటే.. తాము ఈ ఏడాది మరింత భారీగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పి.. ఆమెను తప్పనిసరిగా హాజరు కావాలని కోరగా అప్పటికే రాజకీయాల్లో కాస్త రాటుదేలిన పురంధేశ్వరి.. విద్యార్థి నాయకులకు క్లాస్ పీకినంత పని చేశారట. బుద్ధిగా చదువుకోక.. ఇలాంటి పనులేమిటని తలంటు పోయటమే కాదు.. తాను ఎంపీగా గెలించింది అందరి ఓట్లతో అని... అలాంటి తనను ఒక కులానికే పరిమితం చేసేలా ఇలాంటి కార్యక్రమాలకు పిలిచి.. ప్రచారం చేసుకుంటారా? అని గట్టిగా చెప్పినట్లు చెబుతారు. ఇలాంటి సంప్రదాయం మంచిది కాదని.. తాను మాత్రం అలాంటివాటికి వచ్చే పరిస్థితే లేదని ఖరాఖండిగా చెప్పి పంపేశారట. దీనికి తగ్గట్లే.. ఆ తర్వాత రోజుల్లో సదరు కుల విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమానికి పురంధేశ్వరి హాజరు కాకపోవటం గమనార్హం.
ఇలా హద్దుల దాటినట్లుగా ఉంటే కులాభిమానానికి అడ్డంగా బుక్ అయిన నేతలు పలువురు కనిపిస్తారు. కోస్తాలోని కులభిమానాన్ని చూసిన కొత్తవారు.. దాని నుంచి తేరుకోవటానికి కొంత కాలం పట్టే పరిస్థితి. మిగిలిన ప్రాంతాల్లో కులం ప్రస్తావన కొంత క్లోజ్ అయ్యాక కానీ రాదు. కానీ.. కోస్తాలో మాత్రం క్లోజ్ కావటానికి కులమే ప్రామాణికం అవుతుందని చెబితే అతిశయోక్తి కాదు. అన్ని వర్గాల్లో ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పే కన్నా.. యూత్ లో ఈ తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
అందుకే కోస్తాలో చదువుకోవటానికి వచ్చే ఇతర ప్రాంతాల విద్యార్థులు.. ఈ కులాభిమానం గురించి తెలుసుకొని మొదట షాక్ తిన్నా... తాము చేరిన కోర్సు పూర్తి చేసే నాటికి ఎంతోకొంత ‘‘కులాభిమానాన్ని’’ వంటబట్టించుకుని క్యాంపస్ నుంచి బయటకు పోయే పరిస్థితి.
కోస్తాలో ఉండే కులాభిమాన ఫ్యాక్టరీ పుణ్యమా అని.. కులాన్ని ఎంతగా అభిమానించాలో.. మరెంతగా ఆరాధించాలో విద్యతో పాటు.. కాలేజీ క్యాంపస్ లలో నేర్చుకొని మరీ వెళుతుండటం దశాబ్దాలుగా సాగుతున్నదే. దీని గురించి.. ఏ మీడియా సంస్థలోనూ ప్రశ్నిస్తూ.. ఒక్క వార్త కూడా రాని పరిస్థితి. ఈ కుల రక్కసి నుంచి కోస్తాను కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయం కోస్తాతో సంబంధం ఉండి.. బయట ప్రాంతాల్లో బతికే వారికి మాత్రమే బాగా అర్థమవుతుంది. ఎందుకంటే.. తమ ప్రాంతంలో ఉండే ఈ చిత్రమైన అలవాటు ఎంత ఇబ్బందికరమన్నది.. బయట ప్రాంతాలకు వెళ్లి బతికే వారికి.. నెమ్మదినెమ్మదిగా అర్థమవుతుంది. తెలుగు నేలపై మరే ప్రాంతంలోనూ ఇలాంటి సంక్లిష్టమైన కులాభిమానం కనిపించదు. ఇక కాలేజీల్లో చాలా ఘటనలను ఇక్కడ రాయడం కొంచెం ఇబ్బందికరమే. అందుకే కోస్తాకు చెందిన హితులు.. సన్నిహితులు.. స్నేహితుల ద్వారా చెక్ చేసుకోండి. మీకు మీరుగా చాలానే కొత్త విషయాల్ని తెలుసుకుంటారు.
కొసమెరుపు: ఏంటంటే... మొన్న రిషితేశ్వరి ఘటనలో ముఖ్యమంత్రి కులం వారే ఆమెను ఇలా చేశారనుకుని చాలా ప్రచారం జరిగింది. చివరకు ఓ పత్రిక ఎడిటర్ కూడా అదే విధంగా రాసి తర్వాత క్షమాపణ కూడా చెప్పారు. అంటే ఓవరాక్షన్ వల్ల ఆ కులం నిజానికి కారణం కులం కాకపోయినా ఈ ఘటనలో బ్లేమ్ అయింది.