Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ గెలుపు కోరుతూ యువ‌కుడి 20కె ర‌న్ !

By:  Tupaki Desk   |   9 Nov 2018 9:00 AM GMT
టీఆర్ ఎస్ గెలుపు కోరుతూ యువ‌కుడి 20కె ర‌న్ !
X
తెలంగాణలో జ‌ర‌గ‌నున్న ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీని గెలిపించాల‌ని - కేసీఆర్ మ‌ళ్లీ ముఖ్య‌మంత్రి కావాల‌ని - వ‌న‌ప‌ర్తి ఎమ్మెల్యేగా సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి గెలిపించాల‌ని కోరుతూ పెబ్బేరు మండ‌లం అయ్య‌వారిప‌ల్లికి చెందిన‌ సొప్ప‌రి ప్ర‌కాష్ అనే యువ‌కుడు 20 కె ర‌న్ నిర్వ‌హించాడు. పెబ్బేరు ఆంజ‌నేయ స్వామి ఆల‌యం నుండి మొద‌లుపెట్టి వ‌న‌ప‌ర్తిలోని శ్రీ‌నివాస‌పురం ఆంజ‌నేయ స్వామి ఆల‌యం వ‌ర‌కు ఆగ‌కుండా ప‌రుగెత్తారు. వ‌న‌ప‌ర్తిలో టీఆర్ ఎస్ శాస‌న‌స‌భ అభ్య‌ర్థి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి ఆ యువ‌కుడి ప్రేమ‌కు ఫిదా అయ్యి శాలువాతో స‌త్క‌రించి అభినందించారు. కారు గుర్తు ఉన్న టీ ష‌ర్టు - చేతిలో టీఆర్ ఎస్ జెండాతో ప‌రుగెత్తుతూ దారి పొడ‌వునా వాహ‌న‌దారుల‌ను - ప‌లు గ్రామాల ప్ర‌జ‌ల‌ను ప్ర‌కాష్‌ ఆక‌ర్షించారు. కేసీఆర్ అన్నా - నిరంజ‌న్ రెడ్డి అన్నా అన్నా త‌న‌కు ఎంతో అభిమానం అని - నాలుగేళ్ల‌లో మేము ఏనాడూ ఇలా గ‌ల‌గ‌లా నీరు పార‌డం చూడ‌లేద‌ని అత‌ను అన్నారు.

నేను అథ్లెటిక్ కావ‌డంతో ఇలా ప‌రిగెత్తి ప్ర‌జ‌ల‌కు టీఆర్ ఎస్ ను గెలిపించాల‌న్న సందేశం ఇవ్వాల‌ని అనుకున్నా. ఈ నాలుగున్న‌రేళ్ల టీఆర్ ఎస్ పాల‌న‌లో నిరంజ‌న్ రెడ్డి 70 వేల ఎక‌రాల‌కు నీళ్లు తీసుకువ‌చ్చార‌ని - వ‌న‌ప‌ర్తిని జిల్లాగా చేయ‌డానికి కృషిచేశార‌ని - ఎన్నిక‌ల్లో ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తే మ‌రింత అభివృద్ది చేస్తార‌ని ప్ర‌కాష్ అన్నారు. కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ ఎంతో అభివృద్ది సాధిస్తుంద‌ని - ఎన్నిక‌ల్లో ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌డ‌మే కాకుండా - ఎన్నిక‌ల్లో చెప్ప‌ని వాటిని ప్ర‌వేశ‌పెట్టిన ఏకైక వ్య‌క్తి టీఆర్ ఎస్ అని చెప్పారు. మిష‌న్ భ‌గీరథ‌ ప‌థ‌కంతో గ్రామాల‌కు తాగునీరు అందిస్తున్నార‌ని - రైతుబంధు - రైతు భీమా ప‌థ‌కాల‌తో రైతులు క‌ల‌లో కూడా ఊహించ‌లేద‌న్నారు. 24 గంట‌ల క‌రంటు వ్య‌వ‌సాయానికి ఉచితంగా ఇస్తున్నార‌ని అన్నారు. ఇలాంటి ప‌థ‌కాలు సాధ్య‌మ‌వుతాయ‌ని క‌ల‌లో కూడా ఊహించ‌లేం అలాంటివి నిజం చేశారు కాబ‌ట్టే కేసీఆర్ మ‌ళ్లీ గెల‌వాల‌ని కోరుకుంటున్నాను. నాకు పార్టీల‌తో సంబంధం లేదు. మార్పును చూశాను. అందుకే సీఎంగా కేసీఆర్‌ ను కోరుకుంటున్నాను అన్నారాయ‌న‌.