Begin typing your search above and press return to search.
ఓటేసి యువకుడి సెల్ఫీ...అరెస్ట్
By: Tupaki Desk | 7 Dec 2018 7:32 AM GMTఎన్నికల కమిషన్ ఈసారి కఠిన నిబంధనలు పొందుపర్చింది. పోలింగ్ బూత్ లో సెల్ఫీలు - అసలు పోలింగ్ కేంద్రానికి సెల్ ఫోన్ ను తీసుకురావడాన్నే నిషేధించింది. అంతేకాదు.. తాగి వచ్చి ఓటేయకుండా పోలింగ్ బూత్ ల వద్ద బ్రీత్ ఎనలైజర్ లు కూడా పెట్టి నిష్పక్షపాతంగా ఓటేసేందుకు సర్వం సిద్ధం చేసింది.
అయితే తొలిసారి ఓటేసే యువతలో క్రేజ్ నెలకొంది. ఓటు వేసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని ఓ యువకుడు తహతహలాడాడు. ఎన్నికల కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ లో శివశంకర్ అనే యువకుడు తన మొబైల్ ఫోన్ ను పోలింగ్ బూత్ కు తీసుకొచ్చాడు. ఓటేసిన అనంతరం అక్కడే సెల్ఫీ దిగాడు.
ఈ హఠాత్ పరిణామానికి అవాక్కైన ఎన్నికల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు శివశంకర్ ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలింగ్ కేంద్రాల్లో మొబైల్ ఫోన్స్ కు అనుమతి లేదని.. తీసుకొస్తే శిక్షార్హమేనని స్పష్టం చేశారు.