Begin typing your search above and press return to search.
ఫోన్ కోసం ఓటేయని యువత!
By: Tupaki Desk | 7 Dec 2018 8:55 AM GMTఅన్నం తినకుండా అయినా ఉండగలరేమో కానీ.. సెల్ ఫోన్ లేనిదే నిమిషం ఉండలేని పరిస్థితి ప్రస్తుత సమాజంలో నెలకొంది. సెల్ ఫోన్ కు బానిసగా మారిపోయిన యువత, జనాలు పోలింగ్ వేళ కూడా సెల్ ఫోన్లను వీడలేదు.
ఎన్నికల కమిషన్ ఎంత అవగాహన కల్పించినా.. మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని కోరినా ఓటర్లు పెడచెవిన పెట్టారు. చాలా మంది పోలింగ్ కేంద్రాలకు తమ సెల్ ఫోన్లతో వచ్చారు. ఎన్నికల అధికారులు ఓటేసేందుకు అనుమతించకపోవడంతో చాలా మంది ఓటర్లు ఓటు వేయకుండానే వెనుదిరిగారు.
ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ పరిస్థితి ఎక్కువగా కనిపించింది. చాలా మంది సెలబ్రెటీలు - యువత సెల్ ఫోన్లతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఎన్నికల అధికారులు సెల్ ఫోన్లతో రావద్దని సూచించడంతో వారంతా ఓటింగ్ వేయకుండానే వెనుదిరగడం కనిపించింది. ప్రజాస్వామ్యంలో ఎంతో విలువైన ఓటును కేవలం సెల్ ఫోన్ కారణంగా చాలా మంది వేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ఎన్నికల కమిషన్ ఈసారి కఠిన నిబంధనలు రూపొందించింది. పోలింగ్ బూతుల్లోకి సెల్ ఫోన్లను నిషేధించింది. సెల్ఫీలు తీసుకోవడాన్ని నేరంగా పరిగణించింది. అంతేకాదు తాగి ఓటేసినా శిక్షార్హులవుతారని నిబంధన విధించింది. అంతేకాదు తాగి వచ్చిన వారిని చెక్ చేయడానికి బ్రీత్ ఎనలైజర్లను కూడా సిద్ధంగా ఉంచింది. దీనిపై ఎంతో అవగాహన కల్పించినా కూడా యువత - జనాలు ఈ నిబంధనలను పెడచెవిన పెట్టారు. కొందరు సెల్ ఫోన్లతో పోలింగ్ బూతులకు వచ్చి ఓటేయడానికి అనుమతించకపోవడంతో వెనుదిరగడం గమనార్హం.