Begin typing your search above and press return to search.

లవ్వులోనే కాదు.. సహజీవనంలోనూ బ్రేకప్పే!

By:  Tupaki Desk   |   20 Feb 2019 6:35 AM GMT
లవ్వులోనే కాదు.. సహజీవనంలోనూ బ్రేకప్పే!
X
సహజీవనం(లివ్- ఇన్ రిలేషన్) అనే పదానికి ఇప్పుడు అర్థమే మారిపోతోంది. లివ్-ఇన్ రిలేషన్ అంటే ఇద్దరి భావాలు కలిసిన ఆడ - మగ కలిసి జీవించడం. దీనికి పెళ్లి అనే బంధం కానీ లవ్ అనే ఫీలింగ్ కానీ అవసరం లేదు. ఒకరిఒకరు నచ్చారంటే చాలు సహజీవనానికి రెడీ కావచ్చు.

ఇంతవరకు ప్రేమించుకొని విడిపోయేవాళ్లు(బ్రేకప్) గురించి వింటున్నాం. కానీ ఇటీవల కాలం నుంచి సహజీవనం(లివ్- ఇన్ రిలేషన్)లో విడిపోయే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. అంతేకాదు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ల వరకు వెళ్లి కేసులు పెట్టుకుంటున్నారు. పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసినా న్యాయపరమైన చిక్కులు అనేకం తలెత్తుతున్నాయి. ఇటీవల సుప్రీం కోర్టు ఇష్టపూర్వక శృంగారం తప్పుకాదని తీర్పు నిచ్చింది. ఇన్నాళ్లు ఒకరిఒకరు సహజీవనంలో బ్రేకప్ కాగానే మహిళలు తమపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తుండటంతో సుప్రీం తీర్పుననుసరించి పోలీసులకు ఏం చేయాలో అంతుబట్టడం లేదు.

సహజీవనం కల్చర్ మెట్రో సీటిస్ లోనే మొదట్లో ఉండేది. ఇది రానురాను చిన్నచిన్న నగరాలకు కూడా పాకింది. అభిప్రాయాలు - ఆలోచనల్లో స్వేచ్ఛ ఉంటుందని - పెళ్లయి దూరంగా ఉంటున్నవారు - విడాకులు తీసుకున్నవారు తమ అభిప్రాయాలు కలిసిన వారితో సహజీవనానికి మొగ్గుచూపుతున్నారు. కొంతకాలం భాగానే ఉన్న వారిలో కొంత మనస్పర్థలు రాగానే బ్రేకప్ చెప్పుకుంటూ ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. కొందరు పోలీస్ స్టేషన్ గడప తొక్కుతున్నారు. సహజీవనానికి చట్టబద్ధమైన గుర్తింపు లేకపోవడంతో అనేక సమస్యలు తలెత్తుతున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు. కాగా ఒక్క బెంగూళూరు నగరంలో సహజీవనంలోఈ ఒక్క ఏడాదిలో 300 కేసులకు పైగా కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

విదేశాల్లో మాదిరిగానే కాంట్రాక్ట్ మ్యారేజ్ లను ప్రభుత్వం గుర్తిస్తే కొంతవరకు ఈ సమస్య సద్దుమణుగుతుందని సామాజిక వేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు - నిబందనలపై దృష్టిసారించాలని కోరుతున్నారు. ఏదిఏమైనా సంప్రదాయబద్ధమైన పెళ్లి అనే బంధాన్ని వీడి పాశ్చత్య మోజులో యువత పడిపోవడం వల్లనే వారి జీవితాలు నాశనం అవుతున్నాయని సంప్రదాయవాదులు అంటున్నారు.