Begin typing your search above and press return to search.

బీజేపీ మహిళా నేతకు ఐ లవ్యూ చెప్పాడు

By:  Tupaki Desk   |   18 Sep 2016 7:12 AM GMT
బీజేపీ మహిళా నేతకు ఐ లవ్యూ చెప్పాడు
X
రాజకీయ అభిమానమో లేదంటే కుర్రకారు ప్రేమతాపమో తెలియదు కానీ తమిళనాడులో ఓ పాతికేళ్ల కుర్రాడు బీజేపీ మహిళా నేతకు ఐ లవ్యూ చెప్పి ఇరకాటంలో పడిపోయాడు. బహిరంగ వేదికపై ఆమెను కలిసి ఐలవ్యూ అనడంతో మిగతా బీజేపీ నేతలంతా కుర్రాడిని చితకబాది పోలీసులకు అప్పగించారు.

తమిళనాడులో బీజేపీ ఇంకా పూర్తిగా పాపులర్ కాకపోయినా ఆ రాష్ట్ర బీజేపీ ప్రదాన కార్యదర్శి వానతీ శ్రీనివాసన్ మాత్రం బాగా పాపులర్. బాగా మాట్లాడుతారని... చొరవగా ఉంటారని పేరు. అలాంటి వానతికి నలుగురి మధ్యా 'ఐ లవ్ యూ' చెప్పాడు యువకుడు. వానతి ఎలా రెస్పాండయ్యేవారో ఏమో కానీ... ఆమె కంటే ముందే మిగతా బీజేపీ పురుష నేతలంతా కలిసి కుర్రాడిని పట్టుకుని పోలీసులకు అప్పగించి జైళ్లో పెట్టించారు.

శనివారం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు కోవైలో నిర్వహిస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి వానతి ముఖ్య అతిథిగా వచ్చారు. కార్యక్రమం ముగిసిన తరువాత పలువురు కార్యకర్తలు ఆమెకు షేక్ హ్యాండ్ ఇస్తూ - సెల్ఫీలు దిగారు. వారితో పాటు వచ్చిన తంజావూరుకు చెందిన ముత్తువేల్ అనే యువకుడు ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చి.. చేయి వదలకుండా 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను" అని చెప్పాడు. దీంతో వానతి ఆశ్చర్యపోగా, చుట్టూ ఉన్న బీజేపీ నేతలు సదరు యువకుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు.