Begin typing your search above and press return to search.
మఠంలో అకున్ ఏం చెప్పారో తెలుసా?
By: Tupaki Desk | 30 July 2017 5:00 AM GMTడ్రగ్స్ విచారణ కేసులో నోటీసులు ఎదుర్కొన్న సినీ ప్రముఖులు మీడియాలో ఎంతలా నానారో.. ఈ కేసును మొదట్నించి చూస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ అంతే ఫేమస్ అయ్యారు. డ్రగ్స్ కేసుకు ముందు అకున్ గురించి తెలిసినప్పటికీ.. ఈ కేసు పుణ్యమా అని ఆయనకు వచ్చిన ఇమేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే.. అకున్ ఇప్పుడు పెద్ద సెలబ్రిటీగా మారారని చెబుతున్నారు. సిన్సియర్ పోలీసు అధికారి ఇమేజ్ ను సొంతం చేసుకోవటంతో పాటు.. సినీ ప్రముఖులకు చుక్కలు చూపించిన సంచలనంగా ఆయన మారినట్లుగా పలువురు చెబుతున్నారు.
అదే సమయంలో.. డ్రగ్స్ మాఫియాకు ఆయనో టార్గెట్ గా మారారని.. ఆయన్ను పలువురు బెదిరిస్తున్నట్లుగా చెబుతున్నారు. అయితే.. బెదిరింపుల విషయంలో ఎవరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అకున్ స్వయంగా స్పష్టం చేశారు. తనపై ఎవరి ఒత్తిడి లేదని.. విచారణ విషయంలో ఎవరినీ వదిలేది లేదంటూ పదే పదే చెబుతున్న ఆయన.. తాజాగా రామకృష్ణ మఠానికి వెళ్లారు.
రామకృష్ణ మఠంలో ని స్వామి వివేకానంద హ్యుమన్ ఎక్స్ లెన్సీ ఆధ్వర్యంలో జరిగిన శ్రద్ధ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈకార్యక్రమానికి హైదరాబాద్ మహానగరానికి చెందిన పలువురు యువతీయువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తన ప్రసంగంలో భాగంగా ఆయన డ్రగ్స్ కేసును.. విచారణను ప్రస్తావించారు.
డ్రగ్స్ కేసులో సినీ నటులతో పాటు.. పారిశ్రామికవేత్తల పిల్లలు.. కాలేజీ విద్యార్థులు ఉన్నారన్నారు. ఈ కేసు విషయంలో.. ప్రభుత్వం.. ముఖ్యమంత్రి కూడా సీరియస్ గా ఉన్నారని.. ఎవరినీ వదలొద్దంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. డ్రగ్స్‌ను వాడితే ఆరు నెలల నుంచి మూడేళ్ల వరకూ జైలుశిక్ష ఉంటుందని చెప్పిన అకున్.. ఏడాది వ్యవధిలో హైదరాబాద్ మహా నగరాన్ని 99 శాతం డ్రగ్స్ ఫ్రీ సిటీగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు.
తాను గతంలో హైదరాబాద్ సెంట్రల్ జోన్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ గా పని చేసినప్పుడు కాలేజీల్లో పెద్ద ఎత్తున యాంటీ ర్యాగింగ్ కార్యక్రమాల్ని చేపట్టామని.. పక్కా చర్యలు తీసుకున్నట్లుగా చెప్పారు. ఐఏఎస్.. ఐపీఎస్ లు కావాలంటే 24 గంటలు కష్టపడనక్కర్లేదని.. ఫోకస్డ్ గా ఎనిమిది గంటలు కష్టపడితే సరిపోతుందంటూ యూత్‌కి సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా మాట్లాడారు. మఠంలో అకున్ మాట్లాడిన మాటలు ఆసక్తికరంగా మారాయి.