Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ : అర్ధరాత్రి దెయ్యాల హంగామా ?

By:  Tupaki Desk   |   13 April 2020 11:50 AM GMT
లాక్ డౌన్ : అర్ధరాత్రి దెయ్యాల హంగామా ?
X
కరోనా వైరస్‌ ..ప్రస్తుతం ప్రపంచంలో క్రమక్రమంగా విస్తరిస్తూపోతుంది. ఇప్పటికే ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలకి విస్తరించింది. దీనితో ఈ మహమ్మారి నుండి తమ ప్రజలను కాపాడుకునేందుకు ప్రపంచంలోని మెజారిటీ దేశాలు లాక్‌ డౌన్‌ విధించాయి. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని , అలాగే సామజిక దూరం పాటించాలని , వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ ఈ మహమ్మారిని తరిమికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇక ఇండోనేషియా కూడా తన దేశ పౌరులకు ఇలాంటి సూచనలే చేసింది.

అయితే మారుమూల గ్రామాల్లో కరోనా గురించి అవగాహన లేనివారు నేటికీ వీధుల్లో సంచరిస్తున్నారు. వైరస్‌ గురించి హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో ఇండోనేషియాలోని కెపూ గ్రామానికి చెందిన యువకులు వినూత్న ప్రయోగానికి తెరతీశారు. దెయ్యంను చూపించి ప్రజలను ఇంట్లోనే ఉండేలా చేస్తున్నారు. దెయ్యం దెబ్బకి ఒక్కరు కూడా ఇంట్లో నుండి బయటకి రావడం లేదు.

అదేలా సాధ్యం అని అనుకుంటున్నారా? ఆ గ్రామంలోని కొందరు యువకులే దెయ్యంలా మారి అర్ధరాత్రి వీధుల్లో సంచరిస్తున్నారు. బతిమాలి చెప్పినా కూడా ఇంట్లో ఉండనివారిని ..దెయ్యం పేరు చెప్పి భయంతో ఇంట్లో ఉండేలా చేస్తున్నారు. దీనికి పోలీసుల అనుమతి కూడా తీసుకున్నారు. ఈ విషయం గురించి గ్రామ పెద్ద మాట్లాడుతూ.. "కరోనా గురించి ఎంత చెప్పినా కొంతమందికి అర్థం కావడం లేదు. ఇంట్లో ఉండమని చెబితే ఎదురుతిరుగుతున్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడు చిన్నా పెద్దా ఇంట్లోనే ఉంటున్నారు. మూఢ నమ్మకాలే మమ్మల్ని కాపాడుతున్నాయి" అని వెల్లడించారు.