Begin typing your search above and press return to search.
మనుషులు ఇలా కూడా ఉంటారా?
By: Tupaki Desk | 10 April 2015 6:57 AM GMTమాయమై పోతున్నడమ్మా మనిషన్నవాడు... అనే పాటకు తగ్గట్లు కొందరు వ్యవహరిస్తున్నారు. ప్రమాదకరమైన పరిస్థితుల కంటే.. తమ ఆసక్తులకే ప్రాధాన్యం ఇస్తున్న అలాంటి వ్యక్తిత్వ హీనుల ఘటన వెలుగులోకి వచ్చింది.
కేరళలోని కొట్టాయం జిల్లా ముత్తాంబళంలో లైలా తంగచ్చన్ అనే మహిళ రైలు పట్టాలు దాటుతోంది. ఇంతలో పరశురాం ఎక్స్‌ప్రెస్ రైలు ఆమె దగ్గరికి వచ్చేసింది. ఆమె భయంతో సొమ్మసిల్లిపోయింది. దగ్గర్లో ఎవరైనా ఉంటే ఏం చేస్తారు? ఆమెను పట్టాలపై నుంచి పక్కకు లాగి కాపాడతారు. కానీ ఆ ఇద్దరు యువకులు మాత్రం జేబుల్లోంచి సెల్‌ఫోన్లు తీశారు. సొమ్మసిల్లి పడిపోయిన ఆమె పైనుంచి రైలు వెళ్లిన బీభత్సాన్ని ఫోన్లలో రికార్డు చేశారు! మానవత్వం ఉనికిని ప్రశ్నించేలా వారు ప్రవర్తించారు.
పట్టాలు దాటుతుండగా రైలు రావటం గమనించిన రైల్వేగేటు కాపలాదారు రైలు డ్రైవర్‌ను అప్రమత్తం చేయడానికి ఎర్రజెండా ఊపినా ఫలితం లేకపోయింది. వేగంగా ఉన్న ఎక్ర్‌ప్రెస్ కావడం వల్ల..ఘోరం జరిగిపోయింది. ఆ సంఘటనను చిత్రీకరించిన వారిని ఏం అనాలి?