Begin typing your search above and press return to search.

ఫేక్ వ్యూస్ గాళ్లకు యూట్యూబ్ షాక్

By:  Tupaki Desk   |   15 Sep 2019 7:13 AM GMT
ఫేక్ వ్యూస్ గాళ్లకు యూట్యూబ్ షాక్
X
తాటిని తన్నేవాడుంటే వాడి తలను తన్నేవాడు మన దగ్గర ఉన్నాడు. టెక్నాలజీ దిగ్గజం గూగుల్ నే తప్పుదోవ పట్టించే ఘనులు చాలా మంది ఉన్నారు. గూగుల్ నేతృత్వంలో సాగుతున్న యూట్యూబ్ గురించి తెలియని వారుండరు.. ఆ యూట్యూబ్ నే తప్పుదోవ పట్టించి తమ వీడియోలను లక్షల వ్యూస్ గా మార్చి ట్రెండింగ్ లోకి తెస్తున్న ఘనులు చాలా మంది ఉన్నారు..

క్యాచీ హెడ్డింగ్ లు, తప్పుదోవ పట్టించేలా థంబ్ నేల్స్ తో లక్షలు వ్యూస్ తెచ్చుకుంటున్నారు కొందరు యూటూబర్స్.. ఇప్పటికే అలాంటి ఫేక్ వీడియోలకు నెగెటివ్ లైక్ లు, ఆదాయాన్ని తగ్గించేసిన యూట్యూబ్ తాజాగా లక్షల లక్షలకు వ్యూస్ ను తప్పుడు మార్గాల్లో పెంచుకుంటున్న యూట్యూబర్ల పని పట్టేందుకు నిర్ణయించింది..

ఇటీవల జూలైలో భారతీయ ర్యాప్ సింగర్ వీడియో ఒకటి ఒక రోజులోనే 7.5 కోట్ల వ్యూస్ సాధించి రికార్డ్ సృష్టించింది. ఈ భారీ వ్యూస్ సాధించడానికి ఫేస్ బుక్, వాట్సాప్ గ్రూపుల ద్వారా తప్పుడు మార్గాల్లో వ్యూస్ పెంచుకున్నట్టు సమాచారం. అందుకే ఇలా ఫేక్ వ్యూస్ ను నిజమైన వ్యూస్ గా మలుచుకొని వారంతా యూట్యూబ్ లో ట్రెండింగ్ లోకి వెళుతూ పేరు తెచ్చుకుంటున్నారు.

ఈ కృత్రిమ పద్ధతుల ద్వారా వీడియో వ్యస్ సంఖ్యను పెంచుకుంటున్నట్టు గుర్తించిన యూట్యూబ్ తాజాగా దీనికి అడ్డుకట్ట వేసేందుకు డిసైడ్ అయ్యింది. వేర్వేరు ఇతర పద్ధతుల ద్వారా ఎంత మంది చూశారన్న లెక్క తేలుస్తామని యూట్యూబ్ కంపెనీ తెలిపింది. 24 గంటల్లో రికార్డ్ వ్యూస్ అన్న అంశంలోనూ కొన్ని మార్పులు చేశామని.. డైరెక్ట్ గా లింక్ లు షేర్ చేసుకోవడం.. సెర్చ్ ద్వారా వీడియోలను చూడడం వంటి సహజసిద్ధమైన ప్రక్రియల ఆధారంగా వ్యూస్ లెక్కగడుతామని తెలిపింది. దీంతో సినిమా ట్రైలర్ లు అయనా.. మరే ఇతరులైనా ఇక నుంచి ఫేక్ వ్యూస్ తో మిలియన్స్ మంది తమ వీడియో చూశారని ప్రచారం చేసుకోవడానికి వీల్లేకుండా యూట్యూబ్ కఠిన నిబంధనలు పొందుపరిచింది.