Begin typing your search above and press return to search.

కోర్టుకు ఎంపీ అవినాష్...వివేకా హత్య కేసు నిందితుడు

By:  Tupaki Desk   |   11 Jan 2023 11:32 AM GMT
కోర్టుకు ఎంపీ అవినాష్...వివేకా హత్య కేసు నిందితుడు
X
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విజయవాడ కోర్టుకు హాజరయ్యారు. ఆయన పేరు ఇటీవల కాలంలో నలుగుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన పాత్ర ఉందని ఆరోపణలు ఉన్న నేపధ్యంలో సడెన్ గా ఆయన వివేకా హత్య కేసు ప్రధాన నిందితుడితో పాటు కోర్టు వద్ద కనిపిస్తే మీడియాకి హై బీపీ రాకుండా ఉంటుందా. కడప నుంచి ఎంపీ విజయవాడ కోర్టుకు రావడమేంటి అని మీడియా మొత్తం ఫోకస్ పెట్టేసింది.

కానీ ఈ కోర్టు వ్యవహారం మ్యాటర్ వేరు అని తరువాత తెలిసి కొంత కూల్ అయింది. ఇంతకీ విషయం ఏంటి అంటే ఇప్పటికి ఎనిమిదేళ్ళ క్రితం 2015లో కడప జిల్లా తొండూరులో వైసీపీ నేతలు నిర్వహించిన ధర్నా సందర్భంగా వైఎస్ అవినాష్ తో పాటు వివేకా హత్య కేసు ప్రధాన నిందితుడు దేవిరెడ్డి శంకర్ రెడ్డితో పాటు మరో ఎనభై మంది దాకా వైసీపీ నేతల మీద కేసులు ఉన్నాయి.

ప్రజా ప్రతినిధుల మీద నమోదైన కేసుల విషయంలో విచారణ వేగవంతం చేయాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసుని కూడా ముందుకు తెచ్చారు. అలా విచారణ విజయవాడ కోర్టులో జరుగుతోంది. దాంతో అవినాష్ తో పాటు దేవిరెడ్డి శంకర్ రెడ్డిని కూడా కలిపి తెచ్చారు.

ఇక దేవిరెడ్డి శంకర్ రెడ్డి అయితే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయి కడప జిల్లా కోర్టులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇపుడు ఈ పాత కేసు విషయంలో ఆయన్ని కూడా పోలీసులు వెంటబెట్టుకుని విజయవాడ కోర్టుకు తీసుకువచ్చారు. ఇలా ఒకే ఫ్రేంలో దేవిరెడ్డి శంకర్ రెడ్డి కడప ఎంపీ అవినాష్ కనిపించేసరికి అంతా ఆసక్తిగా చూశారు.

కేసు వివరాలు ఎవరికీ తెలియకపోవడంతో వివేకా హత్య కేసు అని కూడా అనుకున్నారు. ఇదిలా ఉండగా ప్రజా ప్రతినిధుల కోర్టుకు హాజరైన అవినాష్ దేవిరెడ్డి శంకర్ రెడ్డి లకు కోర్టులో ఏమి చెప్పారో తెలియదు ఈ కేసుని ఈ నెల 23కి వాయిదా వేయడంతో తిరిగి వెళ్లారని అంటున్నారు.

మరి ఈ నెల 23న ఈ ఇద్దరూ మళ్లీ హాజరవుతారా అన్నది కూడా చూడాలి. ఏది ఏమైనా వైఎస్ అవినాష్ విజయవాడ కోర్టుకు రావడం, అదే విధంగా దేవిరెడ్డి శంకర్ రెడ్డి రావడంతో మీడియాకు సెంటర్ అట్రాక్షన్ అయిపోయారు అని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.