Begin typing your search above and press return to search.
వివేకా హత్య కేసులో సంచలనం : ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్!
By: Tupaki Desk | 16 April 2023 8:11 AM GMTఆంధ్రప్రదేశ్ లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకోవడం కేసులో పెను సంచలనమైంది. మరోవైపు ఇదే సమయంలో హైదరాబాద్ లో ఉన్న ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటికి కూడా సీబీఐ అధికారులు వెళ్లడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.
-కడప ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్
వైఎస్ వివేకా కేసులో ఈ ఉదయం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇవాళ ఉదయమే పులివెందులలోని ఇంటికి చేరుకొని గంటకు పైగా విచారించిన అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. భాస్కర్ రెడ్డి పీఏ రాఘవరెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కోర్టులో హాజరు పరిచి రిమాండ్ లోకి తీసుకుంటారని తెలుస్తోంది.
-హైదరాబాద్ లోని ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు
తండ్రి భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ అధికారులు.. మరో బృందం హైదరాబాద్ లో ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ఇంటికి చేరుకుంది. ఎంపీ అవినాష్ రెడ్డిని విచారిస్తున్నట్టు మీడియాలో కథనాలు వస్తున్నాయి. కుటుంబ సభ్యులు మినహా మిగిలిన వారిని లోపలకు అనుమతించకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే ఎంపీ అవినాష్ సన్నిహితుడు ఉదయ్ ను అరెస్ట్ చేసిన సీబీఐ ఇప్పుడు అవినాష్ ఇంట్లో విచారణ చేస్తుండడంతో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ నెలకొంది.
ఉదయ్ కుమార్ తన రిమాండ్ రిపోర్టులో ఎంపీ అవినాష్ తో సహా పలువురు వివేకా హత్య కేసులో ఆధారాలు చెరిపేసారని సీబీఐ పేర్కొంది. దీంతో భాస్కర్ రెడ్డి అరెస్ట్.. ఎంపీ అవినాష్ రెడ్డి విచారణ నేపథ్యంలో సీబీఐ తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది.